Brain Stroke Symptoms: స్నానం ఇలా గనక చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.. జాగ్రత్త..

First Published Jan 27, 2022, 3:02 PM IST


Brain Stroke Symptoms: మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే మన పాలిట శాపం గా తయారవుతాయి. అందులోనూ చిన్న విషయాలకు కూడా ప్రమాదం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో స్నానం చేయడంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 

దేశం రోజు రోజుకు చలితీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వాళ్ల సంఖ్య కూడా బాగా పెరిగిందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందులోనూ దేశంలో గత నెల రోజుల నుంచే దీని బారిన వారి సంఖ్య బాగా పెరిగింది. అంతేకాదు దీని బారిన పడిన వాళ్లల్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ప్రమాదకరమైన జబ్బు బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా వైద్యులు తెలుపుతున్న ఈ సూచనలను, సలహాలను తప్పకుండా పాటించాలని పేర్కొంటున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ప్రస్తుతం చలితీవ్రత బాగా పెరిగింది. అయినా ఈ కాలంలో కూడా చల్లటి నీళ్లతో స్నానం చేసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ కాలంలో స్నానం చల్లటి నీళ్లతో చేయడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చల్లని నీళ్లను నెత్తిపై పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ చల్లటి ఉష్ణోగ్రతను మెదడు తట్టుకోలేకే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

బ్రెయిన్ స్ట్రోక్ కాలాలతో సంబంధం లేకుండా వస్తుంది. కానీ ఈ చలికాలంలో దీని కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అందులోనూ గుండెకు సంబంధించిన జబ్బులు, హై బీపీ సమస్యలున్నవారే ఈ ప్రమాదకర బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రమాదరకమైన జబ్బులతో బాధపడేవారు ఈ చాలికాలం మరింత జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.  

ఈ సీజన్ లో చల్లటి నీటికి బదులుగా గోరు వెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. అలాగే హెడ్ బాత్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలపై నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత చేతులను, ఆ తర్వాత ముఖాన్ని తడపాలి. ఇక లాస్ట్ గా నెత్తిపై నీళ్లను పోసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.

లక్షణాలు:  కంటిచూపు సరిగ్గా లేకపోవడం. బాడీలోని ఏదైనా ఒక భాగం తిమ్మిరిగా అనిపించడం. ఏదైన చెబుతుంటే అర్థం చేసుకోకపోవడం, ఏదైనా చెప్పడానికి రాకపోవడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం. విపరీతమైన నెత్తినొప్పి రావడం, వాంతులు, వికారంగా అనిపించడం. స్పృహ కోల్పోవడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణమే. ఇలాంటి లక్షణాలు ఏ మాత్రం మీలో కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. 

 
స్థూలకాయంతో బాధపడేవారు, అధిక రక్తపోటు ఉన్న వారు, డయాబెటీస్ రోగులు, 55 ఏండ్లు దాటిన వారు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాగా దీని బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. అలాగే చల్లని నీళ్లను కాకుండా గోరువెచ్చగా ఉండే నీళ్లనే తాగాలి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలి. స్మోకింగ్ చేయకూడదు. ఆల్కహాల్ జోలికి అస్సలు పోకూడదు. 

click me!