ఈ చిన్న పనులు చేస్తే చాలు ఇంట్లో వాస్తు దోషాలు అన్ని తొలిగిపోతాయ్

First Published Jan 27, 2022, 2:33 PM IST

ఇంట్లో, బయట ఇలా ఎక్కడికి వెళ్లిన  అనేక ఇబ్బందులు (Difficulties) ఎదురవుతున్నాయా! ఈ సమస్యలకు కారణం వాస్తు దోషమే (Vastu dosham) అని పెద్దలు చెబుతారు. వాస్తు దోషం కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యంగా అనేక సమస్యలు ఎదురుకావడంతో ప్రశాంతతను కోల్పోతారు. మరి ఇంటిలో వాస్తు దోషాలు ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తున్నారా! ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఇంటిలోని అన్నీ వాస్తు దోషాలు తొలగి పోవడానికి చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందాం..

ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషం  కారణంగా అనుకున్న పనులు సకాలంలో జరగవు. అన్నింటిలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా (Financially), మానసికంగా (Mentally) మరింత కుంగదీస్తాయి.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవి తగ్గకపోగా మరి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ వాస్తు దోషాలను పరిష్కరించకుంటే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఉప్పు: ఉప్పు (Salt) వాస్తు దోషాలను తొలగించుకోవడానికి సహాయ పడుతుందట. ఇందుకోసం రెండు చిన్నపాటి గిన్నెను తీసుకుని వాటిలో కొంత ఉప్పు వేసి ఆ రెండు గిన్నెలను ఇంట్లో నైరుతి, ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ (Negative energy) తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంటిలో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి

కర్పూరం, లవంగాలు: కొద్దిగా కర్పూరాన్ని (Camphor) తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని లవంగాలను (Cloves) కూడా వేయాలి. ఇలా రెండింటినీ కలిపి మండిస్తే ఇంట్లో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. ఇలా ఉదయం, సాయంత్రం వేళల్లో చేస్తే ఇంటిలోని వారికి అదృష్టం వరిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

పసుపు ఆవాలు, గుగ్గుళ్ళు: పసుపు రంగు ఆవాలు, గుగ్గుళ్లను కలిపి మండిస్తే ఇంటిలో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి శారీరక ఆరోగ్యం (Physical health), మానసిక ప్రశాంతత (Peace of mind) కలుగుతుంది. అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి.

కిటికీలు: కిటికీలను (Windows) ఎప్పుడు తెరిచి ఉంచాలి. అలాగే కిటికీల వద్ద కుండీలలో మొక్కలను ఉంచాలి. ఇలా చేస్తే ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఫలితంగా ఇంటిలోని వారికి అంతా మంచే జరుగుతుంది. శుభఫలితాలను (Good results) పొందగలుగుతారు.

ఫర్నిచర్: కుర్చీలు, టేబుల్, సోఫా, మంచంలనూ ఇలా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను (Furniture) అప్పుడప్పుడు తీసి వేరే దిశలో పెట్టి మళ్లీ యధావిధిగా అమర్చుకోవాలట. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ (Positive Energy) ఏర్పడుతుంది. దీని గురించి ఫెంగ్ షూయ్ వాస్తులో వివరించారు.

వేప ఆకులు: వేప ఆకులలో (Neem leaves) అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వేప ఆకులను కాల్చి పొగ పెడితే ఇంట్లో ఉండే వైరస్, బ్యాక్టీరియా నశిస్తుంది.  అలాగే వేప ఆకులను ఇంట్లో మండిస్తే వాస్తు దోషం కూడా తొలగిపోతుంది. దీంతో ఆరోగ్యం (Health), ఆర్థిక లాభం కలుగుతుంది.

click me!