Bottle gourd: వావ్.. సొరకాయ మన ఆరోగ్యానికి ఇంత మంచి చేస్తదా..!

Published : Jun 20, 2022, 11:44 AM IST

Bottle gourd: సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. దీన్ని తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో  ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
17
Bottle gourd: వావ్.. సొరకాయ మన ఆరోగ్యానికి ఇంత మంచి చేస్తదా..!

సొరకాయ (Bottle gourd) లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొడతాయి. కానీ ఈ సొరకాయంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దీన్ని చూడగానే ముఖం వికారంగా పెడుతుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి చాలా అవసరం కూడా. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.. 
 

27

బరువు తగ్గుతారు: బరువు తగ్గాలనుకునే వారు  రెగ్యులర్ గా సొరకాయను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయ ఓవర్ వెయిట్ ను తగ్గించడమే కాదు .. ఎన్నో వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అందుకే ఈ రోజు నుంచి దీనిని మీ రోజు వారి డైట్ లో చేర్చుకోండి. 

37

కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది: కొన్ని రకాల ఆహారాలు ఉదర సంబంధ సమస్యలకు కారణమవుతాయి. ఊరికూరికే కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే వారు తమ రోజు వారి ఆహారంలో సొరకాయను ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే ఇది చాలా తొందరగా కూడా జీర్ణం అవుతుంది. 
 

47

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: మారుతున్న జీవన శైలి కారణంగా గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వారు సొరకాయను రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సొరకాయ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

57

చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది:  చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి సొరకాయ ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయ రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రోజు వారి ఆహారంలో తిన్నా.. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. 

67

ఒత్తిడిని తగ్గిస్తుంది: ఈ రోజుల్లో ఒత్తిడి లేని మనిషి లేడు. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు కొంతమంది యోగా ను చేస్తే.. మరికొంత మంది వ్యాయామం చేస్తుంటారు. అయితే ఈ సొరకాయ ఒత్తిడిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

77

దీనిలో యాంటి ఆక్సిడెంట్స్ (Anti accidents) అధికంగా ఉండడం వల్ల కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సొరకాయలో ఎక్కువ శాతం నీరు ఉండి తక్కువ కొలెస్ట్రాల్ (Cholesterol) ను కలిగి ఉంటుంది. శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి చల్లదనాన్ని కలిగిస్తుంది. సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి

Read more Photos on
click me!

Recommended Stories