30 ఏండ్ల తర్వాత మీ ఎముకలు బలంగా ఉండాలంటే.. ఇవన్నీ తినడం మానేయండి..

First Published Sep 30, 2022, 11:00 AM IST

30 ఏండ్లు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. ఎముకలు బలహీనంగా ఉంటే ఏ పనీ చేయడానికి చేత కాదు. అయితే 30  పడిన తర్వాత కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. ఎందుకంటే ఇవి మీ ఎముకలను మరింత బలహీనంగా మార్చేస్తాయి. 
 

వయసు పెరిగే కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోవడం సర్వ సాధారణం. ఇలా జరగకూడదంటే మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. వీటివల్ల శరీరం హెల్తీగా ఉంటుంది.  ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే మీ ఎముకలు బలంగా ఉంటాయి. సాధారణంగా 30 ఏండ్ల తర్వాత ఎముకల్లో బలం తగ్గుతుంది. ఇలాంటి వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడే మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఇందుకోసం వేటిని తినకూడదో తెలుసుకుందాం పదండి. 

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

ఉప్పు మన శరీరానికి అవసరమే. కానీ ఎక్కువగా తీసుుకుంటే మాత్రం మొదటికే మోసం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉప్పు కాల్షియం లోపానికి దారితీస్తుంది. మోతాదుకు మించి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ద్వారా కాల్షియం ఎక్కువ మొత్తంలో బయటకు వెలుతుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక నిర్దిష్టమొత్తంలో  సోడియం, పొటాషియంలు మీ శరీరంలో ఉండాలి. సోడియం ఎక్కువగా తీసుకుంటే.. సోడియం, పొటాషియం అసమతుల్యతంగా మారుతాయి.  దీనివల్ల ఎముకలు బలహీనపడటమే కాదు బోలు ఎముకల వ్యాధి కూడా వస్తుంది. అందుకే ఉప్పును ఎక్కువగా తీసుకోకండి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానేయండి. అప్పుడే మీ ఎముకలు బలంగా ఉంటాయి.
 

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఐరన్ మన ఆరోగ్యానికి మంచిదే..  అయినప్పటికీ దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం ఎముకలకు అస్సలు మంచిది కాదు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటుగా ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తీసుకున్నప్పుడు.. ఐరన్ కాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. అందుకే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితిలోనే తీసుకోవాలి. 
 

కార్బోనేటేడ్ డ్రింక్స్

సోడాలు, శీతల పానీయాలు వంటి  కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఫాస్ఫారిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఫాస్ఫారిక్ ఆమ్లం రక్తంలో ఆమ్లత స్థాయిని పెంచుతుంది. దీంతో శరీరంలో ఎసిడిటీ స్థాయిని తగ్గించడానికి ఎముకల నుంచి కాల్షియం సహాయపడుతుంది. ఫలితంగా ఎముకల ఖనిజ సాంద్రత తగ్గుతుంది. అంతేకాదు ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది. 

స్వీట్ ఐటమ్స్

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు తెలుసా..? చక్కెరతో చేసిన స్వీట్లను తినడం వల్ల మీ ఎముకలు గాయం అవడం,  బోలు ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు చక్కెరను తీసుకోవడం మొత్తమే మానేయాల్సిన అవసరం లేదు. మోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యా  ఉండదు. 
 

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు

మన శరీరానికి ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. దీంతోనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ప్రోటీన్  ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవసరానికి మించి తీసుకుంటున్నారు. కానీ అవసరానికి మించి తినడం వల్ల కాల్షియం ఒత్తిడికి దారితీస్తుంది. అలాగే ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఫుడ్ ను తినే వారు ముఖ్యంగా మాంసం ద్వారా  ప్రోటీన్ ను తీసుకునే వారు తక్కువ ఎముక సాంద్రత ప్రమాదాన్ని కలిగి ఉంటారు. అందుకే ప్రోటీన్ ఫుడ్ ను పరిమితిలో తినండి.

Vegetables

ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ వాటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియం శోషణను నిరోధిస్తాయి. అయితే అన్ని రకాల ఆకు కూరలు ఒకేలా ఉండవు. కానీ బచ్చలికూర, కాలే కూరలు కాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తాయి. కాబట్టి ఆకుకూరల నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి జున్ను వంటి సులువుగా శోషించుకోబడే కాల్షియం ఉండే ఆహారాలను వాటితో పాటుగా తీసుకోండి. 

కెఫిన్
 
కొన్ని రకాల శీతల పానీయాలు, టీ, కాఫీల్లో కెఫిన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే  పానీయాలను తీసుకోవడం వల్ల కాల్షియం శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  100 మి.గ్రా కెఫిన్ తీసుకున్నప్పుడు.. శరీరం నుంచి సుమారు 6 మి.గ్రా కాల్షియం పోతుంది. స్వీట్ ఐటమ్స్ తో పాటుగా కెఫిన్ కూడా ఎముకల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో రోజూ 400 మి.గ్రా కెఫిన్ కంటే ఎక్కువగా ఉంటే ఎముకలు బలహీనపడతాయి. పగుళ్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. 

click me!