ఎప్పుడూ మూడ్ ఆఫ్ లోనే ఉంటున్నారా? దానికి కారణం ఇదే..!

First Published Sep 30, 2022, 9:57 AM IST

తిట్టినప్పుడో,  చులకన చేసి మాట్లాడినప్పుడో, అనుకున్నది సాధించలేకపోయానే.. అనే వివిధ కారణాల మూడ్ ఆఫ్ అవుతుంది. అయితే వీటి వల్ల ఎప్పుడో ఒక సారి మాత్రమే మూడ్ ఆఫ్ అవుతారు. కానీ కొంతమంది మంది మాత్రం ఎప్పుడు చూసినా మూడ్ ఆఫ్ లోనే ఉంటుంటారు. దానికి కారణం ఏంటో తెలుసా..?

శరీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మీరు శారీరకంగా హెల్తీగా ఉంటారు. కానీ చాలా మంది శరీరక ఆరోగ్యానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మానసిక ఆరోగ్యానికి ఇవ్వరు. దీనివల్లే లేనిపోని మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎంతో మంది. ఇది వారికి తెలియపోవచ్చు కానీ.. చూసే వాళ్లకు మాత్రం పక్కాగా అర్థమవుతుంది. కనిపించే శారీరక సమస్య కంటే.. మానసిక సమస్యే మిమ్మల్ని డేంజర్ లో పడేస్తుంది. అందుకే మానసిక ఆరోగ్య సమస్యల గురించి శ్రద్ధ తీసుకోవాలి. 

అయితే మనం తినే ఆహారం మన శారీరక ఆరోగ్యంపైనే కాదు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపెడుతుంది. అందుకే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొన్ని ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అకస్మత్తుగా మూడ్ మారడాన్నే మూడ్ డిజార్టర్ అంటారు. మరి ఇలా ఎందుకు అవుతుంతో తెలుసుకుందాం పదండి. 
 

మూడ్ డిజార్డర్ ఎన్నో మానసిక ఆరోగ్య సమస్యలతో పాటుగా ఇతర కారణాల వల్ల కూడా కలుగుతుంది. వీటిలో నాలుగు పోషకాహార సమస్యలు కూడా మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

యాంటీ ఆక్సిడెంట్ల లోపం

మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం. వీటితోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. మీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు లోపించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటుగా మూడ్ డిజార్డర్ కు కూడా దారితీస్తుంది. లేదా దీన్ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల లోపం వల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్ ఐటమ్స్,  శుద్ధి చేసిన పిండి పదార్థాలు, విషపూరిత కొవ్వులు, రసాయనాలు ఉన్న ఆహారాలను తిన్నప్పుడు మనస్సు ప్రభావితమవుతుంది. ఇది మూడ్ చేంజ్ కు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఆహారాన్ని రోజూ తినండి. 

zinc

జింక్

మన శరీర విధులు సక్రమంగా జరిగేందుకు జింక్ చాలా అవసరం. ఈ జింక్ శరీరంలో లోపిస్తే మానసిక  అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల మెదడులోని కొన్ని భాగాల పని తీరును దెబ్బతింటుంది. ఇది మానసిక స్థితిలో మార్పునకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుల్లలు, చికెన్, షెల్ఫిష్, బాదం వంటి ఆహారాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది.
 

విటమిన్ బి6

విటమిన్ బి6 లోపం కూడా మానసిక రుగ్మతలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి6 వల్లే మన మనోభావాలను ప్రభావితం చేసే హార్మోన్ల పనితీరుకు మెరుగుపడుతుంది. అందుకే ఇది లోపించినప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నట్స్, సీఫుడ్, మాంసం, బీన్స్, ఆకుకూరల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. 

రాగి

శరీరంలో రాగి స్థాయిలు ఎక్కువ మొత్తంలో ఉంటే కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల డోపామైన్ అనే హార్మోన్ తగ్గుతుంది. దీంతో మీరు మూడ్ ఆఫ్ లోకి వెళ్లిపోతారు. ఇది ప్రసవానంతర వ్యాకులతకు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు. శరీరంలో రాగి  స్థాయిలు ఎక్కువగా ఉంటే కూడా ఆందోళన పెరుగుతుంది. సాధారణంగా రాగి స్థాయిలు ఎక్కువగా ఉంటే మానసిక ఆరోగ్యం క్షీణించడానికి మాత్రమే దారితీస్తుంది.

click me!