వీటివల్లే ఎముకల బలం తగ్గుతుంది

First Published Feb 7, 2023, 1:59 PM IST

మన ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు మన లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎముకలు, కండరాల ఆరోగ్యం కోసం ముందుగా మనం చేయాల్సిన పని విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం. 
 

bone health

ఎముకలే లేకుంటే మన శరీరానికి ఈ ఆకారం అంటూ ఉండదు. ఎముకల ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా.. మన మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి ఎముకల బలం చాలా చాలా అవసరం. అందుకే ఎముకల ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ఎముక సాంద్రత కోల్పోతే అవి చాలా సులవుగా విరిగిపోతాయి. బోలు ఎముకల వ్యాధి కూడా వస్తుంది. ఎముకలు బలంగా లేకపోవడం వల్లే ఈ వ్యాధి వస్తుంది. ఈ రోజుల్లో ఈ వ్యాధితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. 

Bone Health

ఎముకలు, కండరాలు బలంగా ఉంటేనే మనం ఎలాంటి పనులనైనా చేస్తాం.. ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులను తప్పకుండా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు, కండరాల ఆరోగ్యం, బలం కోసం మనం చేయాల్సిన మొదటి పని విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా విషయాలు ఎముకల బలాన్ని తగ్గిస్తాయి. ఎముకల వ్యాధికి దారితీస్తాయి. 

Bone Health

ఉదాహరణకు సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఎముక ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి విటమిన్ డి అందుతుంది. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన మరొక ముఖ్యమైన పోషకం కాల్షియం. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఈ కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్ డి ఉండటం కూడా చాలా అవసరం. ఇతర విటమిన్ల మాదిరిగా విటమిన్ డి ఒక్క ఆహారం ద్వారానే అందదు. సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డి మనకు లభిస్తుంది. అందుకే తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.
 

bone health

అలాగే వ్యాయామం లేకపోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. శరీరాన్ని కదిలించకుండా  ఎల్లప్పుడూ ఒకే చోట కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది.  దీనివల్ల ఎముకలు, కండరాల ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. అందుకే ఇవి బలంగా ఉండాలంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం లేకపోవడం వల్ల కూడా మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. ధూమపానం, ఆల్కహాల్ కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను మానుకోండి. 

bone health

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ రోజు వారి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలే ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. అప్పుడే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 

ఎముకల ఆరోగ్యం కోసం తినాల్సిన ఆహారాలు: పాలు, పెరుగు,  జున్ను,  వెన్న వంటి పాల ఉత్పత్తులతో పాటుగా బీన్స్, సార్డినెస్, ఆకుకూరలు, గుడ్లు, సాల్మన్, గింజలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.
 

click me!