Rice: వైట్ రైస్ కాదు.. రెడ్ రైస్ , బ్లాక్ రైస్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది?

Published : Oct 10, 2026, 02:12 PM IST

Rice: రోజూ భోజనంలో తెల్ల అన్నం తింటున్నారా? దానికంటే హెల్దీ ఫుడ్ ని మీ డైట్ లో భాగం చేసుకోవాలని అనుకుంటున్నారా? వైట్ రైస్ కి బదులు ఏం తినాలి? బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి?

PREV
13
White Rice

మనం రోజుకి మూడు పూటలా అన్నమే తింటూ ఉంటాం. కానీ, రోజూ వైట్ రైస్ తింటే బరువు పెరిగితామనో, షుగర్ లెవల్స్ పెరిగిపోతాయనో చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. అందుకే, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారంతా.. బ్రౌన్ రైస్ తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ, కేవలం బ్రౌన్ రైస్ మాత్రమే కాదు.... వైట్ రైస్ కి ప్రత్యామ్నాయంగా.. బ్లాక్ రైస్, రెడ్ రైస్ అంటూ కలర్ ఫుల్ బియ్యాలు మార్కెట్లో ఉన్నాయి. మరి, వాటన్నింటిలో నిజంగా ఏది ఆరోగ్యకరం. అసలు బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏవి తినడం మంచిది?

23
బియ్యంలో రకాలు...

1.బ్లాక్ రైస్..

చూడటానికి నల్లగా ఉన్నా.. దీనిని ఫర్బిడెన్ రైస్ అని పిలుస్తారు. ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

బ్రౌన్ రైస్..

తెల్ల బియ్యంతో పోలిస్తే దీని పొట్టు తొలగించకపోవడం వల్ల పీచు పదార్థం ఎక్కువశాతం లభిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం.

వైల్డ్ రైస్ : ఇవి పొడవుగా, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే గింజలు. వీటిలో ప్రొటీన్లు ఎక్కువ మోతాదులో ఉండి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.

33
రెడ్ రైస్

ఎరుపు రంగు పొట్టుతో ఉండే ఈ బియ్యంలో ఐరన్, విటమిన్ బి సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఎంపిక.

పర్పుల్ రైస్.. తెల్లటి అన్నానికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నవారికి 'పర్పుల్ రైస్' ఒక అద్భుతమైన ఎంపిక. ఈ బియ్యాన్ని ఉడికించినప్పుడు.. ముదురు ఊదా రంగులోకి మారుతుంది. ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

బాస్మతీ రైస్..

బాస్మతీ రైస్ చూడటానికి తెల్లగానే ఉంటుంది. కానీ, దీని గింజలు పొడవుగా, సన్నగా ఉంటాయి. ఈ బియ్యం నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుంది. బిర్యానీ, పులావ్ లకు చాలా బాగుంటుంది. దీనిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వైట్ రైస్ కంటే ఇదే బెస్ట్.

మట్టా రైస్ : దక్షిణాదిలో, ముఖ్యంగా కేరళలో విరివిగా లభించే ఈ ఎరుపు రంగు మట్టా బియ్యం చూడడానికి లావుగా, మునుపటి రకాలకు భిన్నంగా ఉంటాయి. సాంప్రదాయ వంటకాలతో పాటు ఇది ఆరోగ్యానికి చాలా బలమైనదిగా భావిస్తారు.

వీటన్నింటిలో ఏ బియ్యం ఆరోగ్యకరం...?

అన్ని రకాల బియ్యం వాటికవే ప్రత్యేకమైన పోషకాలను కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లాక్ రైస్ (Black Rice), రెడ్ రైస్ (Red Rice) అత్యంత ఆరోగ్యకరం. ఎందుకంటే... బ్లాక్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. అలాగే రెడ్ రైస్ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు పూర్తి రక్షణ కల్పిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories