Vaseline Cleaning Hacks: వ్యాజిలిన్ చర్మానికే కాదు..ఇంట్లో వస్తువులను మెరిపించేస్తుంది, తలుపులకు చెద, కిచెన్ జిడ్డుగా ఉందని టెన్షన్ పడుతున్నారా? ఎక్కువ ఆలోచించకండి. కెమికల్స్ అవసరం లేదు. కాస్త వేడి నీళ్లు, వ్యాజిలిన్ ఉంటే చాలు.. ఇల్లు తళతళలాడుతుంది.
పాత చెక్క తలుపులు, జిడ్డు పట్టిన కిచెన్ క్యాబినెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లెదర్ బ్యాగులను క్లీన్ చేయడానికి ఖరీదైన కెమికల్స్ కొనక్కర్లేదు. చలికాలంలో పెదాలకు రాసుకునే 'వ్యాజిలిన్' చాలు.సూపర్ ఆల్-ఇన్-వన్ క్లీనింగ్ లిక్విడ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
27
మ్యాజిక్ లిక్విడ్ తయారీ విధానం
ఒక గిన్నెలో బాగా మరిగిన వేడి నీళ్లను తీసుకోండి. అందులో పావు చెంచా (1/4 స్పూన్) వ్యాజిలిన్ వేసి బాగా కరిగించండి. ఆ నీళ్లను చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ బట్టను ఆ నీళ్లలో ముంచి, నీళ్లు లేకుండా గట్టిగా పిండేయండి. ఈ లిక్విడ్‌తో ఏమేం క్లీన్ చేయొచ్చో తెలుసా?
37
గ్యాస్ స్టవ్ తుప్పు పట్టదు
గ్యాస్ పొయ్యి, స్టవ్ రింగులను దీంతో క్లీన్ చేస్తే జిడ్డు వదలడమే కాదు.. ఆ రింగులు తుప్పు (Rust) పట్టకుండా ఉంటాయి.
దుమ్ము పట్టి కళావిహీనంగా మారిన చెక్క తలుపులను ఈ బట్టతో తుడిస్తే చాలు. వెంటనే వార్నిష్ లేదా పాలిష్ చేసినట్లుగా కొత్తగా మెరిసిపోతాయి.
57
జిడ్డు పట్టిన కిచెన్ క్యాబినెట్లు
కిచెన్ క్యాబినెట్ డోర్లు, డ్రాయర్ల మీద ఉండే వంట జిడ్డు, నూనె మరకలను ఈ లిక్విడ్ క్షణాల్లో మాయం చేస్తుంది. వాటికి సరికొత్త లుక్ ఇస్తుంది. దీని వాసనకు వంటగది దరిదాపుల్లోకి బొద్దింకలు రావు.
67
మిక్సీ, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులు
ఫ్రిడ్జ్, మిక్సీ గ్రైండర్ లేదా డిష్ వాషర్లను తుడవడానికి ఖరీదైన క్లీనర్లు వద్దు. ఈ బట్టతో తుడిస్తే అవి తళతళా మెరుస్తాయి.
ఇంకా మురికి పట్టిన స్విచ్ బోర్డులు, నల్లగా మారిన స్విచ్ బోర్డులను ఈ బట్టతో సున్నితంగా తుడిస్తే చాలు, వెంటనే కొత్తవాటిలా క్లీన్ అవుతాయి.
77
లెదర్ బ్యాగులు, సూట్‌కేసులు
దుమ్ము పట్టిన లెదర్ హ్యాండ్ బ్యాగులు, సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులను దీంతో తుడిస్తే వాటి చర్మం పాడవదు. పైగా పాత మెరుపు తిరిగి వస్తుంది.