Hyderabad: హైదరాబాద్ దగ్గర్లో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. వీకెండ్‌లో వెళ్లడానికి బెస్ట్!

Published : Aug 18, 2026, 02:49 PM IST

Hyderabad: ఈ ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త రిలాక్స్ కావాలనుకుంటున్నారా? వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్లి కొత్త అనుభూతిని పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్‌ నుంచి తక్కువ టైంలో వెళ్లగలిగే 7 బెస్ట్ పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
18
హైదరాబాద్ దగ్గర్లోని బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్

హైదరాబాద్‌లో బిజీ లైఫ్‌తో విసిగిపోయారా? వీకెండ్ లో మంచి ప్లేస్ లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ టూరింగ్ స్పాట్ల గురించి తెలుసుకోవాల్సిందే. ప్రకృతి అందాలు, కొండలు, జలాశయాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇలా భిన్నమైన అనుభూతులను అందించే ప్రాంతాలు హైదరాబాద్‌కు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. వీకెండ్ టూర్ కి ఇవి బెస్ట్ అనే చెప్పాలి. మరి లేటేందుకు ఆ పర్యాటక ప్రదేశాలేంటో తెలుసుకోండి.

28
బీదర్

హైదరాబాద్ నుంచి సుమారు 140–150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌కి కారులో సాధారణంగా 3 గంటల వరకు ప్రయాణం పడుతుంది. కర్ణాటకలోని ఈ చారిత్రక పట్టణం వీకెండ్ ట్రిప్‌కు చక్కటి ఎంపిక. బీదర్ కోట ఇక్కడ ప్రధాన ఆకర్షణ. భారీ కోట గోడలు, పురాతన నిర్మాణాలు చరిత్రపై ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నుంచి ఉదయం తొందరగా బయలుదే వెళ్తే ఒక రోజులోనే ప్రధాన ప్రదేశాలను చూసి రావచ్చు. అయితే ప్రశాంతంగా చుట్టుపక్కల ప్రాంతాలను ఆస్వాదించాలంటే ఒక రాత్రి బీదర్‌లో బస చేయడం మంచిది.

38
వరంగల్

హైదరాబాద్ నుంచి వరంగల్ దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో సుమారు 3 నుంచి 3.5 గంటల్లో చేరుకోవచ్చు. కాకతీయుల వైభవానికి అద్దం పట్టే వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం వంటి ప్రదేశాలు ఈ ప్రయాణానికి ప్రధాన ఆకర్షణలు. టైం ఉంటే వరంగల్ నుంచి రామప్ప ఆలయానికి వెళ్లడం ద్వారా ట్రిప్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

48
యాదగిరిగుట్ట

హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట చాలా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి దాదాపు 55–65 కిలోమీటర్ల దూరంలో ఉండే యాదాద్రికి సాధారణంగా గంట నుంచి గంటన్నరలో చేరుకోవచ్చు. ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆలయ దర్శనంతో పాటు యాదాద్రి పరిసరాలలో ప్రశాంతంగా గడపవచ్చు. పెద్దగా సెలవు తీసుకోలేని వారికి ఇది మంచి ట్రిప్.

58
అనంతగిరి కొండలు

ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి హైదరాబాద్ నుంచి అనంతగిరి కొండలు అత్యంత అనుకూలమైన టూరిస్ట్ స్పాట్. హైదరాబాద్ నుంచి సుమారు 80–90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి సాధారణంగా 2 గంటల సమయంలో చేరుకోవచ్చు. అడవులు, కొండలు, పచ్చని వాతావరణం, ప్రశాంతమైన రోడ్లు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణ. అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు ప్రకృతి మధ్య వాకింగ్, చిన్న ట్రెక్కింగ్, ఫొటోగ్రఫీ వంటివి చేయవచ్చు.

68
నాగార్జునసాగర్

హైదరాబాద్ నుంచి సుమారు 155–165 కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్ ఉంది. రోడ్డు మార్గంలో సాధారణంగా 3 నుంచి 4 గంటలు పడుతుంది. భారీ నాగార్జునసాగర్ డ్యామ్ ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ. నీటి అందాలతో పాటు నాగార్జునకొండకు సంబంధించిన చారిత్రక, బౌద్ధ ప్రదేశాలను కూడా ట్రిప్‌లో చూడవచ్చు. టైం, అందుబాటును బట్టి బోటింగ్ వంటి వాటిని కూడా ఆస్వాదించవచ్చు.

78
శ్రీశైలం

హైదరాబాద్ నుంచి సుమారు 210–230 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలానికి సాధారణంగా 4 నుంచి 5 గంటల ప్రయాణ సమయం పడుతుంది. శ్రీశైలం ప్రత్యేకత కేవలం ఆలయంలోనే లేదు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో నల్లమల అటవీ ప్రాంతం, కొండలు, లోయలు, కృష్ణా నది పరిసరాలు ప్రయాణానికే ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. మల్లికార్జున స్వామి ఆలయం ప్రధాన ఆధ్యాత్మిక ఆకర్షణ కాగా, శ్రీశైలం డ్యామ్, నల్లమల అటవీ ప్రాంతం, చుట్టుపక్కల వ్యూ పాయింట్లు ట్రిప్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

88
కర్నూలు

హైదరాబాద్ నుంచి కర్నూలు దాదాపు 210–220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో సుమారు 4 నుంచి 5 గంటల్లో చేరుకోవచ్చు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు నగరానికి చారిత్రక గుర్తింపు. ఈ ప్రాంతంలో చారిత్రక కట్టడాలతో పాటు దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలను కలిపి చూడవచ్చు. సమయం ఉంటే మహానంది వంటి ప్రదేశాలను కూడా ట్రిప్‌లో చేర్చుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories