Parenting: ఆడపిల్లలకు తండ్రి అవసరం ఏ వయసులో ఎలా ఉంటుంది? వయసుని బట్టి తండ్రి ప్రేమ మారాలా?

Published : Aug 18, 2026, 10:54 AM IST

Parenting: ఆడపిల్లలు తల్లి కంటే.. తండ్రి మీద కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుందని చెప్పొచ్చు. అయితే, పిల్లల వయసు బట్టి.. తండ్రి ప్రేమ మారాలి. మరి, ఆడపిల్లలు ఏ వయసులో ఎలాంటి ప్రేమ కోరుకుంటారు?

PREV
13
Parenting..

ఆడపిల్ల జీవితంలో తండ్రి అనేది ఒక కేవలం బంధం మాత్రమే కాదు.. ఒక కొండంత అభయం, జీవితాంతం తోడుండే ఒక గొప్ప మార్గదర్శకం. కూతురి ఎదుగుదలలో ప్రతి దశలోనూ తండ్రి పాత్ర చాలా కీలకమైనది. ఏ వయసులో తండ్రి ఎలాంటి ప్రేమ చూపించాలి? ఎలాంటి శ్రద్ధ చూపించాలి?

23
1.బాల్యం( 0 నుంచి 8 సంవత్సరాలు)..

ఈ వయసులో తండ్రి ఎక్కువగా భద్రత, విశ్వాసం చూపించాలి. సహజంగా ఈ వయసులో ఆడ పిల్లలకు ప్రపంచం అంటే తండ్రి చేతులే. ఈ వయసులో తండ్రి ఎక్కువగా ప్రేమను చూపించాలి. ఆ ప్రేమ ఎత్తుకోవడంపై ఉండాలి. తండ్రి ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు ఆమె పొందే స్పర్శ, ఆమెలో అపరిమితమైన సురక్షిత భావాన్ని నింపుతుంది. ఈ వయసులో తండ్రి చూపించ ప్రేమ.. పిల్లల్లో నేను సురక్షితంగా ఉన్నాను అనే కొండంత నమ్మకాన్ని ఇస్తుంది.

ఈ వయసు పిల్లలతో తండ్రి ఎక్కువగా ఆడుకోవాలి. వేలు పట్టుకొని నడిపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయాలకు భయపడటం లాంటివి చేయరు.

2.టీనేజ్ కి ముందు వయసు(9 నుంచి 12 సంవత్సరాలు)..

ఈ వయసులో ఆడ పిల్లలు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, స్నేహితులను అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. తన రూపం, తన ప్రతిభ గురించి ఆలోచించడం మొదలుపెడతారు.ఈ వయసులో తండ్రి మాటలతో ప్రేమ చూపించాలి. అంటే.. ‘ నువ్వు చాలా తెలివైన దానివి’, ‘ నువ్వు ఏదైనా సాధించగలవు’ అని ప్రతి విషయంలోనూ ప్రోత్సాహం చూపించాలి. ఈ వయసులో తండ్రి ఇచ్చే మెప్పు, బయటి ప్రపంచం నుంచి వచ్చే కంపారిజన్స్, విమర్శలను ఎదుర్కునేలా చేస్తుంది.

33
3. టీనేజ్( 13 నుంచి 19 సంవత్సరాలు)...

ఈ వయసు నుంచి ఆడ పిల్లల్లో శారీరక మార్పులు జరగడం మొదలౌతాయి. అత్యంత సున్నితమైన దశ ఇది. ఈ వయసులో ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోలేరు.. ఇతరుల పట్ల ఆకర్షణ మొదలౌతుంది. ఈ వయసులో తండ్రి... వారితో కఠినంగా కాకుండా మంచి స్నేహితుడిలా ఉండాలి. ఏది మంచి ఏది చెడు అనే విషయాలు తండ్రి దగ్గరుండి నేర్పించాలి. చాలా మంది ఈ విషయాలు తల్లి చెప్పాలి అనుకుంటారు. కానీ, తండ్రి చెబితే.. బయట అబ్బాయిల స్వభావం ఎలా ఉంటుంది అనేది బాగా తెలుస్తుంది.

యంగ్ ఏజ్..(20 నుంచి 25).. 

ఈ ఏజ్ లో దాదాపు అమ్మాయిలు తమ ఉన్నత చదువులు, ఉద్యోగం, కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఈ సమయంలో.. తండ్రి.. కూతరి కలలు రెక్కలు తొడగాలి. నీకు అండగా నేను ఉన్నాను.. నువ్వు అనుకున్నది సాధించు అనే భరోసా ఇవ్వాలి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ఓటములను తట్టుకుని నిలబడే మానసిక ధైర్యం తండ్రి ఇచ్చే కొండంత అభయం నుంచే వస్తుంది.

పెళ్లి వయసు.. (26+ సంవత్సరాలు):

పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినా, సొంతంగా కుటుంబాన్ని నిర్మించుకుంటున్నా.. కూతురికి నాన్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఒడిదుడుకులు ఎదురైనా "నాకు నాన్న ఉన్నాడు" అనే ధైర్యాన్ని నింపాలి.

ఎందుకు అవసరం?: కొత్త బంధాలలో సర్దుకుపోయే క్రమంలో లేదా సమస్యలు వచ్చినప్పుడు తండ్రి ఇచ్చే అనుభవపూర్వకమైన సలహాలు ఆమెకు పెద్ద దిక్కుగా నిలుస్తాయి.

ఆడపిల్ల జీవితంలో తండ్రి అనేది కేవలం బాధ్యత నెరవేర్చే వ్యక్తి కాదు... ఆమె ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి ప్రాణం పోసే ఒక అమూల్యమైన శక్తి. నాన్న చూపే నిరపేక్షమైన ప్రేమే ఆమెను సమాజంలో ఒక బలమైన, స్వతంత్రమైన మహిళగా తీర్చిదిద్దుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories