Sundar Pichai: 15 ఏళ్లుగా ఒకే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న గూగుల్ CEO సుందర్ పిచాయ్.. అసలు కారణం ఇదే!

Published : Nov 04, 2026, 03:09 PM IST

Sundar Pichai: గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ గురించి తెలియని వారుండరు. ఆయన దాదాపు 15 ఏళ్లుగా ఉదయం ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారట. ఇంతకీ ఆయన ఏం తింటారు? ఇన్నేళ్లుగా ఒకే బ్రేక్‌ఫాస్ట్‌ను ఎందుకు తింటున్నారు? దీని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం.

PREV
14
గూగుల్ సీఈఓ సింపుల్ లైఫ్‌స్టైల్

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్‌ను (Google) నడిపిస్తున్న సీఈఓ సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం బిజీగా ఉండే ఆయన చాలా సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతారట. ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన తన లైఫ్ స్టైల్ కి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

సుందర్ పిచాయ్ గత 15 ఏళ్లుగా ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్నారు. ఉదయం ఏం తినాలనే ఆలోచనకు టైమ్ వేస్ట్ చేయకుండా, ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనుల మీద ఫోకస్ పెట్టేందుకు ఈ అలవాటును ఆయన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇండియన్ ఫుడ్స్ అంటే తనకున్న ఇష్టం, తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి కూడా ఆయన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

24
బ్రేక్‌ఫాస్ట్ లో ఏం తింటారు?

సుందర్ పిచాయ్ తన డైట్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన రోజూ ఉదయం గుడ్లు, టోస్ట్ (Eggs and Toast) తింటారట. వాటితో పాటు వేడివేడిగా ఒక కప్పు ఛాయ్ తాగుతారట. దాదాపు 15 ఏళ్లుగా ఇదే రొటీన్ ఫాలో అవుతున్నారట. రోజూ ఏం తినాలని ఆలోచించే సమయాన్ని తగ్గించుకుని, ఇతర పనులపై దృష్టి పెట్టేందుకే ఇలా చేస్తారట.

34
అలా ఉండటమే ఇష్టం

ఉదయం పూట ప్రశాంతంగా ఉండటాన్ని ఆయన ఇష్టపడతారట. చక్కగా ఆలోచించడానికి, వార్తలు తెలుసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (The Wall Street Journal) లాంటి న్యూస్‌పేపర్స్ చదవడం ఆయన మార్నింగ్ రొటీన్‌లో ఒక భాగమట. అలాగే సుందర్ పిచాయ్ రోజూ ఉదయం 6:45 నుంచి 7:30 గంటల మధ్య నిద్రలేస్తారట. రాత్రి 10 గంటల తర్వాత తన పనులను మరింత చురుగ్గా చేసుకుంటారట. రోజుకు కనీసం 6.5 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకుంటారట.

44
బిజీ షెడ్యూల్‌లోనూ ఫిట్‌నెస్‌పై ఫోకస్

పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే, సుందర్ పిచాయ్ వ్యాయామానికి కచ్చితంగా సమయం కేటాయిస్తారట. వీకెండ్స్‌లో క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తారట. వాకింగ్, హైకింగ్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.

వర్కింగ్ డేస్ విషయానికొస్తే.. శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా వ్యాయామం చేస్తారట. సోమవారం నుంచి గురువారం వరకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వర్కవుట్స్ చేస్తారట. రోజూ ఒకే రకమైన వ్యాయామాలు చేయడం ఆయనకు నచ్చదట. ఆ రోజు తన మానసిక పరిస్థితిని బట్టి సైక్లింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేస్తుంటానని ఆయన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories