
వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే సులువైన వ్యాయామాలు. రోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, జాగింగ్ చేయడమే కాదు కొందరు 5, 10, 20 కి.మీ కూడా రన్నింగ్ చేస్తుంటారు… తమ డైలీ రొటీన్‌లో రన్నింగ్‌ని భాగం చేసుకుంటున్నారు.
అయితే రన్నింగ్ చేయడానికి ఏవో సాధారణ స్పోర్ట్స్ షూస్ వేసుకుంటే సరిపోదు... పాదాలకు తగ్గ కుషనింగ్, సరైన గ్రిప్, కంఫర్టబుల్ ఫిట్ ఉండే రన్నింగ్ షూస్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన షూస్ లేకుంటే పరుగెత్తేటప్పుడు ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగని ఎక్కువ డబ్బులు పెట్టి కొనే షూసే బెస్ట్ అని కూడా చెప్పలేం. మన దేశంలో అందుబాటులో ఉన్న ధర, వాడే విధానం, కుషనింగ్ లాంటి ఫీచర్ల ఆధారంగా మగవారు వాడేందుకు అనువైన 6 బెస్ట్ రన్నింగ్ షూస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
కొత్తగా రన్నింగ్ మొదలుపెట్టేవారు పెద్దగా ఖర్చు లేకుండా ఒక జత రన్నింగ్ షూస్ కొనాలనుకుంటే డెకథ్లాన్ జాగ్‌ఫ్లో 100 మోడల్ బెస్ట్ ఆప్షన్. ఈ షూలో కుషనింగ్ ఫీచర్‌తో పాటు ఫోమ్ సోల్ (Foam Sole) ఇచ్చారు. ముందు, వెనుక భాగంలో ఉన్న రబ్బర్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ నేలపై మంచి గ్రిప్ ఇవ్వడానికి సాయపడుతుంది. వారానికి 10 కి.మీ వరకు రన్నింగ్ చేసేవారికి ఇది బెస్ట్ మోడల్ అని డెకథ్లాన్ చెబుతోంది.
ధర : సుమారు రూ.1,599
ఎవరికి సెట్ అవుతుంది? : కొత్తగా రన్నింగ్ మొదలుపెట్టేవారికి అంటే తక్కువ దూరం పరుగెత్తేవారికి.
ఫీచర్లు : తక్కువ ధర, కుషనింగ్, మంచి గ్రిప్.
గమనిక : ఎక్కువ దూరం లేదా రోజూ హెవీగా రన్నింగ్ చేసేవారికి ఇది ప్రొఫెషనల్ షూ కాదు.
తక్కువ ఖర్చుతో రన్నింగ్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక ప్రాక్టికల్ ఆప్షన్.
అడిడాస్ (Adidas) సంస్థకు చెందిన డ్యూరామో ఎస్ఎల్ మోడల్ డైలీ రన్నింగ్, వర్కవుట్స్ కోసం వాడుకోగల సింపుల్ రన్నింగ్ షూ. బరువు తక్కువగా ఉండి సులువుగా పరుగెత్తేందుకు వీలుగా ఇందులో లైట్‌మోషన్ మిడ్‌సోల్ డిజైన్ చేశారు. అలాగే, మెష్ అప్పర్ (Mesh Upper) వల్ల పాదాలకు మంచి గాలి ఆడుతుంది. ఎక్కువసేపు షూ వేసుకున్నప్పుడు కలిగే ఇబ్బందిని ఇది తగ్గిస్తుంది. అడిడాస్ వెబ్‌సైట్‌లో ఆఫర్‌తో కలిపి దీని ధర సుమారు రూ.3,299 గా ఉంది. దీని అసలు ధర రూ.6,599.
ధర : ఆఫర్ ధర సుమారు రూ.3,299.50; అసలు ధర రూ.6,599.
ఎవరికి సెట్ అవుతుంది? : డైలీ జాగింగ్, తక్కువ నుంచి మోస్తరు దూరం పరుగెత్తేవారికి.
ఫీచర్లు : లైట్ మోషన్ కుషనింగ్, మెష్ అప్పర్.
గమనిక : ఆఫర్ ధర, సైజు మారే అవకాశం ఉంది. కొనే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.
పాపులర్ బ్రాండ్‌లో తక్కువ ధరకే రన్నింగ్ షూ కావాలనుకునే వారికి డ్యూరామో ఎస్ఎల్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
నైక్ (Nike) కంపెనీకి చెందిన రెవల్యూషన్ 8 మోడల్ కొత్తగా రన్నింగ్ స్టార్ట్ చేసేవారికి మరో మంచి ఆప్షన్. ఇందులో ఫోమ్ మిడ్‌సోల్ ఇచ్చారు. మీరు వేసే ప్రతి అడుగులో సాఫ్ట్ కుషనింగ్ ఫీల్ ఇచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. దీని ఫ్లెక్సిబుల్ ఫోర్‌ఫుట్ (Flexible Forefoot) వల్ల పాదాలను చాలా సహజంగా వంచి అడుగులు వేయొచ్చు. పాత మోడల్స్ కంటే ఇందులో గాలి బాగా ఆడే మెష్ అప్పర్‌ను వాడినట్లు నైక్ చెబుతోంది.
ధర : సుమారు రూ.4,295.
ఎవరికి సెట్ అవుతుంది? : బిగినర్స్, తక్కువ దూరం పరుగెత్తేవారికి, జాగింగ్ చేసేవారికి.
ఫీచర్లు : ఫోమ్ కుషనింగ్, ఫ్లెక్సిబుల్ ఫోర్‌ఫుట్, బ్రీతబుల్ మెష్.
గమనిక : ఎక్కువ దూరం లేదా స్పీడ్ రన్నింగ్ ట్రైనింగ్ కోసం అయితే ఇది మీకు సెట్ అవుతుందో లేదో ఒకసారి ఆలోచించి కొనండి.
నైక్ బ్రాండ్‌లో బేసిక్ రన్నింగ్ షూస్ కోసం చూసేవాళ్లు ఈ మోడల్ ట్రై చేయొచ్చు.
రోజూ రోడ్డు మీద పరుగెత్తేవారు పరిగణించాల్సిన మోడల్ ఈ నైక్ డౌన్ షిప్టర్ 14. ఇది రోడ్ రన్నింగ్ (Road Running) కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన షూ. బరువు తక్కువగా ఉండే ఫోమ్ కుషనింగ్, మెష్ అప్పర్ ఇందులో ఉన్నాయి. రెగ్యులర్ రన్నింగ్, జాగింగ్ లాంటి వాటికి ఇది బాగా సెట్ అవుతుంది. నైక్ ఇండియా వెబ్‌సైట్‌లో దీని ధర సుమారు రూ.4,895 గా ఉంది.
ధర : సుమారు రూ.4,895.
ఎవరికి సెట్ అవుతుంది? : రోజూ రోడ్ రన్నింగ్ చేసేవారికి, బిగినర్స్ నుంచి మోస్తరు రన్నింగ్ చేసేవారికి.
ఫీచర్లు : లైట్‌వెయిట్ ఫోమ్, బ్రీతబుల్ అప్పర్.
గమనిక : ఎక్కువ కుషనింగ్ కావాలనుకునే వారికి ఇది సరిపోకపోవచ్చు. ఒకసారి వేసుకుని చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది.
తక్కువ లేదా మీడియం బడ్జెట్‌లో నైక్ రన్నింగ్ షూస్ కొనాలనుకునే వారికి డౌన్ షిప్టర్ 14 మంచి ఎంపిక.
రోజూ చేసే రన్నింగ్ మాత్రమే కాకుండా స్పీడ్ రన్నింగ్, లాంగ్ రన్ లాంటి వాటికి కూడా ఒకే షూ వాడాలనుకునేవారు నైక్ పెగాసస్ 42 మోడల్‌ని చూడొచ్చు. ఇందులో ReactX ఫోమ్, ఫుల్-లెంగ్త్ ఎయిర్ జూమ్ యూనిట్ టెక్నాలజీలు వాడారు. కుషనింగ్‌తో పాటు రెస్పాన్సివ్ ఫీల్ కలిగేలా దీన్ని డిజైన్ చేశారు. రెగ్యులర్ రన్నింగ్, మీడియం స్పీడ్ ట్రైనింగ్ ఇలా అన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది.
ధర : సుమారు రూ.13,995.
ఎవరికి సెట్ అవుతుంది? : రెగ్యులర్ రన్నర్స్, డైలీ ట్రైనింగ్, మోస్తరు స్పీడ్ రన్నింగ్ కోసం.
ఫీచర్లు : ReactX ఫోమ్, ఎయిర్ జూమ్ యూనిట్, మల్టీపర్పస్ రన్నింగ్ ఆప్షన్స్.
గమనిక : కేవలం సాఫ్ట్ కుషనింగ్ మాత్రమే కావాలనుకునే వారు దీన్ని మొదటి ఛాయిస్‌గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఒకే షూతో అన్ని రకాల రన్నింగ్ ట్రైనింగ్స్ చేయాలనుకునేవాళ్లు దీన్ని పరిశీలించవచ్చు.
ఎక్కువ దూరం పరుగెత్తేవారు లేదా వేసే ప్రతి అడుగులోనూ మృదువైన కుషనింగ్ ఫీల్ కావాలనుకునేవాళ్లు ఆసిస్ జెల్ నింబుస్ 28 మోడల్‌ను చూడొచ్చు. ఇందులో FF BLAST PLUS కుషనింగ్, PureGEL టెక్నాలజీ వాడారు. లాంగ్ రన్ చేసేటప్పుడు పాదాలకు చాలా సాఫ్ట్‌గా అనిపించేలా ఈ మిడ్‌సోల్ సిస్టమ్‌ను తయారు చేశారు. న్యూట్రల్, అండర్‌ప్రొనేషన్ ఫుట్ టైప్ ఉన్నవారికి ఇది బాగా సెట్ అవుతుందని ఆసిస్ చెబుతోంది.
ధర : రూ.16,999.
ఎవరికి సెట్ అవుతుంది? : లాంగ్ రన్ చేసేవారికి, సాఫ్ట్ కుషనింగ్ కావాలనుకునే వారికి.
ఫీచర్లు : FF BLAST PLUS, PureGEL, హై-కుషనింగ్.
గమనిక : ఇది చాలా ప్రీమియం మోడల్. కొనే ముందు మీ పాదాల ఆకృతి, మీరు పరుగెత్తే స్టైల్‌కి ఇది సెట్ అవుతుందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోండి.
ఎక్కువ కుషనింగ్ ఉండే ప్రీమియం రన్నింగ్ షూస్ కోసం చూసేవారికి జెల్ నింబుస్ 28 బెస్ట్ ఆప్షన్.
మీకు ఏ రన్నింగ్ షూ సెట్ అవుతుంది?
తక్కువ బడ్జెట్‌లో రన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే డెకథ్లాన్ జాగ్‌ఫ్లో 100 లేదా నైక్ రెవల్యూషన్ 8 మోడల్స్ చూడొచ్చు. రోజూ రెగ్యులర్ రన్నింగ్ కోసం అయితే అడిడాస్ డ్యూరామో ఎస్ఎల్ లేదా నైక్ డౌన్ షిప్టర్ 14 మీకు సాయపడతాయి. రన్నింగ్ బాగా అలవాటు ఉన్నవాళ్లు అన్ని రకాల ట్రైనింగ్ కోసం నైక్ పెగాసస్ 42ని ట్రై చేయొచ్చు. ఇక ఎక్కువ కుషనింగ్ కావాలనుకునే వారు ఆసిస్ జెల్ నింబుస్ 28 వైపు వెళ్లొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే.. మంచి రన్నింగ్ షూ అంటే ఎక్కువ ధర ఉన్నదో లేదా పెద్ద బ్రాండ్‌కి చెందినదో కాదు. మీ పాదాలకు కంఫర్ట్‌గా ఉంటూ, మీ రన్నింగ్ స్టైల్‌కి సెట్ అయ్యే షూనే బెస్ట్ షూ.