Cotton Candy History: కాటన్ క్యాండీ ఎవరు కనిపెట్టారో తెలుసా? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?

Published : Sep 28, 2026, 02:04 PM ISTUpdated : Sep 28, 2026, 02:07 PM IST

Cotton Candy History: చిన్నప్పుడు జాతరల్లో, సర్కస్ ల దగ్గర కనిపించే రంగురంగుల కాటన్ క్యాండీ అంటే అందరికీ ఇష్టమే. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఇది తింటే క్యాన్సర్ వస్తుందని చాలా చోట్ల బ్యాన్ చేశారు కూడా. అయితే ఈ కాటన్ క్యాండీ ఎలా పుట్టిందో తెలుసా?

PREV
15
కాటన్ క్యాండీ హిస్టరీ

చిన్నప్పుడు జాతరల్లో, సర్కస్ ల దగ్గర కనిపించే రంగురంగుల కాటన్ క్యాండీ అంటే అందరికీ ఇష్టమే. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఇది తింటే క్యాన్సర్ వస్తుందని చాలా చోట్ల బ్యాన్ చేశారు కూడా.

పుల్లకు చుట్టి ఉండే కాటన్ క్యాండీని మనమంతా కచ్చితంగా తినే ఉంటాం. దీన్నే మనం 'తాత గడ్డం' లేదా 'బొంబాయి మిఠాయి' అని పిలుస్తుంటాం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ మిఠాయి ఇప్పటికీ వీధుల్లో, మార్కెట్లలో దొరుకుతుంది. పిల్లలకు ఇది ఎంతో ఇష్టం. అయితే, పట్టులా కనిపించే ఈ తీయని కాటన్ క్యాండీని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? ఈ కాటన్ క్యాండీ ఎలా పుట్టిందో తెలుసా?

25
అమెరికాలో తయారైన తొలి కాటన్ క్యాండీ

కాటన్ క్యాండీని తొలిసారిగా అమెరికాలో తయారు చేశారు. విలియమ్స్ జేమ్స్ మారిసన్ అనే అమెరికన్ డెంటిస్ట్ దీన్ని కనిపెట్టారు. కొత్త వస్తువులను తయారు చేయడంపై ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. 1897లో జేమ్స్ మారిసన్…. జాన్ సి. వార్టన్ అనే స్వీట్స్ తయారు చేసే వ్యక్తితో కలిసి ఒక యంత్రాన్ని కనిపెట్టారు. ఈ ప్రత్యేకమైన యంత్రంలో వేడి చక్కెరను గిరగిరా తిప్పడం ద్వారా క్యాండీని తయారు చేసేవారు.

35
తొలి సంపాదన 5 లక్షల డాలర్లు

డెంటిస్ట్ జేమ్స్ ఈ యంత్రానికి 'ఫెయిరీ ఫ్లాస్' అనే పేరుతో పేటెంట్ పొందారు. యంత్రాన్ని తయారు చేసిన 7 ఏళ్ల తర్వాత, వారు దాన్ని ఒక ప్రదర్శనలో ఉంచి, ఒక్కో బాక్స్‌ను 25 పైసల ధరకు అమ్మడం ప్రారంభించారు. చరిత్రలో నమోదైన వివరాల ప్రకారం, 7 నెలల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో జేమ్స్ 68,000కు పైగా బాక్సులను విక్రయించారు. దీని ద్వారా ఆయన 17,000 డాలర్లు, అంటే సుమారు 5 లక్షల డాలర్లు సంపాదించారు.

45
కాటన్ క్యాండీ అని పేరు పెట్టిన మరో డెంటిస్ట్

డెంటిస్ట్ జేమ్స్ తొలిసారిగా ఈ క్యాండీని 'ఫెయిరీ ఫ్లాస్' పేరుతో అమ్మారు. ఆ తర్వాత 1920లో డాక్టర్ జోసెఫ్ లాస్కో అనే మరో డెంటిస్ట్ ఇలాంటి యంత్రాన్నే తయారు చేసి, ఈ మిఠాయికి 'కాటన్ క్యాండీ' అని సింపుల్‌గా పేరు పెట్టారు. డాక్టర్ జోసెఫ్ యంత్రంలో తయారైన క్యాండీ చూడటానికి అచ్చం పత్తిలాగే ఉండేది. అందుకే ప్రజలు కూడా ఈ పేరును సులభంగా యాక్సెప్ట్ చేశారు.

55
120 ఏళ్ల చరిత్ర

ప్రారంభంలో ఈ క్యాండీని తెలుపు రంగులో అమ్మేవారు. కొన్ని ఏళ్ల తర్వాత ఇది లేత గులాబీ, నీలం రంగులతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కాటన్ క్యాండీ చరిత్ర మొదలై నేటికి 120 ఏళ్లు గడిచినా, చిన్నపిల్లల్లో దీన్ని తినాలనే క్రేజ్ మాత్రం ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, కొత్తగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories