కొబ్బరి నూనె కూడా మడమల పగుళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే తేమ లక్షణాలు పగుళ్లను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి కొబ్బరి నూనె పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తే పాదాల వాపు, నొప్పి, పగుళ్లు తగ్గుతాయి. అలాగే పాదాల చర్మం స్మూత్ గా అవుతుంది.