Plastic Vs Glass Vs Ceramic: పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఏది బెటర్ అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ప్లాస్టిక్, గాజు, సిరామిక్..ఇలా ఆప్షన్లు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి?
పచ్చడి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జాడీలు. కానీ ఇప్పుడు వ్యాపారులు ప్లాస్టిక్ లేదా గాజు సీసాల్లో పచ్చళ్లను అమ్ముతున్నారు. కొన్ని ప్లాస్టిక్ కవర్లలో కూడా వస్తున్నాయి. పచ్చళ్లను ఎక్కువ కాలం నిల్వ చేయాలి కాబట్టి, సరైన డబ్బాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఏ డబ్బా వాడితే మంచిదో ఇప్పుడు చూద్దాం.
25
ప్లాస్టిక్ డబ్బాలు
పచ్చళ్లను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు షాపు నుంచి ప్లాస్టిక్ డబ్బాలో పచ్చడి తెస్తే, వెంటనే దాన్ని వేరే డబ్బాలోకి మార్చుకోండి. పచ్చళ్లలో వెనిగర్, సిట్రిక్, లాక్టిక్, ఎసిటిక్ లాంటి ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్లాస్టిక్‌తో రియాక్ట్ అయి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.
35
గాజు సీసాలు
పచ్చళ్లను గాజు లేదా సిరామిక్ సీసాల్లో నిల్వ చేసుకోవచ్చు. ఇవి పచ్చళ్ల నిల్వకు బెస్ట్ అని చాలామంది భావిస్తారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి ప్రత్యేకమైన గాజు సీసాలు ఉంటాయి. నాణ్యమైన గాజు సీసాలు పచ్చడిలోని ఆమ్లాలు, లవణాలతో ఎలాంటి రియాక్షన్ చెందవు. ఇవి ఎలాంటి రసాయనాలను విడుదల చేయవు. కాబట్టి ఎక్కువ కాలం పచ్చళ్లు నిల్వ చేయడానికి నాణ్యమైన గాజు సీసాలు వాడటం మంచిది.
పాతకాలం నుంచి పచ్చళ్లను సిరామిక్ లేదా పింగాణీ జాడీల్లోనే నిల్వ చేస్తున్నారు. ఈ జాడీలు మసాలాల సువాసనను బయటకు పోకుండా అడ్డుకుంటాయి. సంప్రదాయ మట్టి కుండలు ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసి, పచ్చడి సహజమైన రుచిని కాపాడతాయి. మట్టి కుండల్లో పచ్చడి ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.
55
పచ్చళ్లు నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పచ్చడి పెట్టే ముందు డబ్బా లేదా జాడీ 100 శాతం పొడిగా ఉండేలా చూసుకోండి. ఒక్క చుక్క నీరు పడినా మీ పచ్చడి పాడైపోతుంది. పచ్చడి తీయడానికి ప్రతిసారీ శుభ్రమైన, పొడిగా ఉన్న చెంచాను మాత్రమే వాడండి. పచ్చడి తీశాక డబ్బా మూతను గట్టిగా బిగించండి.