జీర్ణక్రియ మెరుగుపడుతుంది...
భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణాశయం, ప్రేగులు ఉత్తేజితమౌతాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమే కాకుండా.. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
2. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
మనం ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. భోజనం తర్వాత నడవడం వల్ల కండరాలు ఆ గ్లూకోజ్‌ను శక్తిగా వినియోగించుకుంటాయి. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి లేదా వచ్చే అవకాశం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.
3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది
భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. అదే కొద్దిసేపు నడవడం వల్ల జీవక్రియ (Metabolism) వేగవంతమై క్యాలరీలు ఖర్చవుతాయి, ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.