రోజూ బాదం పప్పు తింటే కలిగే ప్రయోజనాలు...
మెదడు పదునుగా మారుతుంది : బాదంలో ఉండే విటమిన్-E, ఎల్-కార్నిటైన్ , రిబోఫ్లేవిన్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అల్జీమర్స్ వంటి సమస్యల నుండి మెదడును కాపాడతాయి.
బరువు తగ్గానికి హెల్ప్ చేస్తుంది: వీటిలోని ప్రొటీన్, ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఉదయాన్నే ఇవి తినడం వల్ల రోజంతా అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరికలు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యం బలంగా ఉంటుంది: బాదంలోని యాంటీఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బిపి నియంత్రణలో ఉంటుంది.
చర్మం ప్రకాశవంతంగా మారుతుంది: విటమిన్-E పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. ముడతలు తగ్గి, చర్మం సహజంగా మెరుస్తుంది.
షుగర్ లెవల్స్ కంట్రోల్: బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, టైప్-2 డయాబెటిస్ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.
బాదం పప్పు ఎలా తినాలి..?
రాత్రి వేళ 4-5 బాదం పప్పులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే దాని పైన ఉండే గోధుమ రంగు పొట్టును తీసివేసి, బాగా నమిలి తినండి. క్రమం తప్పకుండా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు మీకు లభిస్తాయి.