ఎముకలు నొప్పిగా ఉన్నాయా..? ఈ విటమిన్ లోపమే కారణం..

First Published Sep 11, 2022, 9:44 AM IST

కొందరు ఎప్పుడూ బలహీనంగా ఉంటూ.. ఎముకల నొప్పితో బాధపడుతుంటారు. ఇలా కావడానికి శరీరంలో విటమిన్ డి లోపించడమే కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. అవన్నీ అందితేనే శరీరం సక్రమంగా పని చేస్తుంది. ఏ విటమిన్ తక్కువైనా.. ఎక్కువైనా మన శరీరంపై తీవ్రప్రభావం పడుతుంది. ఏదో ఒక భాగం దెబ్బతింటుంది. అందుకే శరీరంలో విటమిన్లు, ప్రోటీన్లు లోపించడకుండా చూసుకోవాలి. 
 

మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా అందుతుంది. సూర్యరశ్మిలో ఉండని వారు ఈ ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఎముకలు నొప్పి పుడతాయి. బలహీనపడతాయి కూడా. వీటితో పాటుగా దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ మన శరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.. 
 

మన శరీరంలో కాల్షియంను శోషించుకోవడానికి విటమిన్ డి సహాయపడుతుంది. ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. విటమిన్ డి గుండెకు కూడా మేలు చేస్తుంది. విటమిన్ డి శరీరంలో తగినంత మోతాదులో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ విటమిన్ ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఈ విటమిన్ డి షుగర్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే శరీరంలో ఉండే వివిధ  అవయవాలను బలంగా చేస్తుంది. 

Vitamin d

విటమిన్ డి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది కూడా. ఇది నాడీవ్యవస్థ, మెదడు ను దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది.  

విటమిన్ డి లోపం లక్షణాలు: మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని కొన్ని సంకేతాల ద్వారా, వైద్య పరీక్షల ద్వారా గుర్తించుకోవచ్చు. 

విటమిన్ డి లోపముంటే శరీరంపై ఏవైనా గాయాలైతే అవి తొందరగా నయం కావు. అలాగే ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు వస్తాయి. అలాగే కండరాలు కూడా నొప్పి పుడతాయి. బద్దకం, సోమరితనం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఎముకల్లో నొప్పి కూడా పుడుతుంది. అలాగే జుట్టు పగిలిపోవడం, తెల్లబడటం వంటివి విటమిన్ డి లోపానికి సంకేతాలు. దీనిలోపం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. 

click me!