ఈ ఫుడ్స్ ను తింటే రొమ్ము క్యాన్సర్ ముప్పు తప్పుతుంది

First Published Sep 10, 2022, 5:04 PM IST

బెర్రీలు, బీన్స్, పులియ బెట్టిన కొన్ని ఆహారాలు, సిట్రస్ పండ్లు, కొవ్వు చేపలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు  వంటి కొన్ని రకాల ఆహారాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవారు రొమ్ము క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఈ క్యాన్సర్ నెలసరి ఆగిపోయిన వారిలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్యాన్సర్ రాకుండా చేయడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తింటే రొమ్ము క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. 
 

ముదురు ఆకు కూరలు

 ముదురు ఆకు కూరలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు దారితీసే ఫ్రీరాడికల్స్ అంతం చేస్తాయి. ఈ కూరగాయలను తిన్న ఆడవారికి ఈ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉందని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జర్నల్ లో ప్రచురించబడిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ కూరగాయలను సలాడ్ గా లేదా ఆలివ్ ఆయిల్ లో వేయించి తింటే మంచిది. ఇందుకోసం బచ్చలి కూర, పాలకూర, కాలే వంటి వాటిని రోజూ వారి ఆహారంలో చేర్చుకోవాలి. 
 

బెర్రీలు

బెర్రీలు ఎన్నో రకాల ప్రోటీన్లను కలిగి ఉంటాయి. వీటిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న కణాలను బాగుచేస్తాయి. అలాగే కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇవి క్యాన్సర్ కణాలు వేగంగా పెరగకుండా అడ్డుపడతాయి కూడా.. యాంటీ ఆక్సిడెంట్స్ జర్నల్ లో ప్రచురించడిన అధ్యయనం ప్రకారం.. బెర్రీలు క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుని వాటిని నాశనం చేస్తాయి. ఇందుకోసం బ్లూ బెర్రీలను, బ్లాక్ బెర్రీలను, క్రాన్ బెర్రీలను, రాస్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీలను తినాలి. క్యాన్సర్ పేషెంట్లకు వీటిని తప్పకుండా ఇవ్వాలి. 
 

సిట్రస్ పండ్లు

నిమ్మకాయ, ద్రాక్షలు, బొప్పాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేయడంతో పాటుగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తప్పిస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి తో పాటుగా కాల్షియం, ఫోలేట్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తినే ఆడవారికి 10 శాతం రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 
 

పులియబెట్టిన ఆహారాలు

పులియబెట్టిన ఆహారాల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఈస్ట్ లు, మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పులియబెట్టిన ఆహారాల్లో ఉండే ప్రోబయోటిక్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చి.. క్యాన్సర్ తో పోరాడుతాయి. ముడి చీజ్, ఆపిల్ సైడర్ వెనిగర్, ఊరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. 
 

కొవ్వు చేపలు

సాల్మన్, ట్యూనా వంటి కొన్ని రకాల చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని తరచుగా తినే ఆడవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

బీన్స్

బీన్స్ కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ముఖ్యమైన ఖనిజాలు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అలాగే ప్రమాదకరమైన ఎన్నో రకాల క్యాన్సర్ వంటి రోగాలను కూడా అడ్డుకుంటాయి. రోజూ కొద్ది మొత్తంలో బీన్స్ ను తినే ఆడవారికి రొమ్ము క్యాన్సర్ ముప్పు తప్పుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గాలంటే సోయా బీన్స్, చిక్కుడు గింజలు, బాఠానీలు వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండండి. 

click me!