జస్ట్ 2 నిమిషాలు ముఖానికి ఐస్ మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

Published : Aug 17, 2025, 07:04 PM IST

ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల క్రీం లను పెడుతుంటారు. కానీ ఒక చిన్న ఐస్ ముక్క మీ ముఖాన్ని మ్యాజిక్ చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

PREV
15
skin care

ఐస్ మసాజ్ ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అయ్యింది. కానీ ఇది జస్ట్ ఒక ట్రెండ్ మాత్రమే కాదు.. ఇది మన చర్మానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఈ మధ్యే ట్రెండ్ అయినా.. ఎన్నో ప్రయోజనాలున్న పాత టెక్నిక్ ఇది. ఐస్ ను ముఖానికి రుద్దితే చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. 

అలాగే మన చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇది మీ చర్మ రంగును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ రంధ్రాల సమస్యలు కూడా తగ్గుతాయి. అసలు ఐస్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
ముఖానికి ఐస్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు

వాపు తగ్గుతుంది: కొంతమందికి ఉదయం లేవగానే ముఖం, కళ్లు బాగా ఉబ్బిపోయి ఉంటాయి. దీన్ని ఎలా తగ్గించుకోవాలో చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి వారికి ఐస్ మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. అవును జస్ట్ రెండు నిమిషాలు ఐస్ మసాజ్ చేస్తే ముఖం, కళ్ల వాపు తగ్గిపోతాయి.

35
మొటిమలు తగ్గుతాయి:

చాలా మందికి ముఖం నిండా మొటిమలు అవుతుంటాయి. ఇవి పెరగడే తప్ప తగ్గడం అస్సలు ఉండదు. మొటిమలు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ మొటిమలు తగ్గవు. 

అందులోనూ వీటివల్ల ముఖ చర్మం ఎర్రగా అవుతుంది. ముఖం వాపు కూడా వస్తుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఐస్ మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. మీరు రోజూ రెండు నిమిషాలు ఐస్ మసాజ్ చేస్తే మొటిమల ఎరుపు, వాపు రెండూ తగ్గుతాయి. మొటిమలు కూడా తొందరగా తగ్గిపోతాయి.

45
ముడతలు తగ్గుతాయి:

 వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడటం చాలా కామన్. కానీ కొంత మందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారికి ఐస్ మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుంది. అవును రెగ్యులర్ గా ఐస్ మసాజ్ చేయడం వల్ల ముఖంపై ముడతలు, గీతలు తగ్గిపోతాయి.

మేకప్ కు ముందు: మేకప్ కు ముందు ఐస్ మసాజ్ చేయడం కూడా మంచిదే. మీరు గనుక మేకప్ వేసుకోవడానికి ముందు ఐస్ ను ముఖానికి రుద్దితే మీ మేకప్ ఎక్కువ సేపు అలాగే ఉంటుంది. అలాగే మీ ఫేస్ కు మంచి షైనింగ్ వస్తుంది.

55
ఐస్ మసాజ్ ఎలా చేయాలి?

ఇందుకోసం నీట్ గా ఉండే కాటన్ గుడ్డను లేదా మెత్తని టవల్ ను తీసుకుని ఒకటి రెండు ఐస్ క్యూబ్స్ ను తీసుకోండి. వీటిని గుడ్డలో చుట్టి మీ చర్మానికి రుద్దండి. అయితే ఐస్ ను ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా రుద్దకూడదు. ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉంటే. ఐస్ ను సున్నితంగా వలయాలుగా తిప్పండి. ముఖ్యంగా నుదురు, బుగ్గలు, కళ్ల కింద, గడ్డం ప్రాంతాలకు ఎక్కువగా మసాజ్ చేయండి. ఈ ఐస్ మసాజ్ ను కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చేయాలి. ఇది వెంటనే మీ చర్మాన్ని రీఫ్రెష్ గా , కాంతివంతంగా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories