పిస్తా పప్పులతో బోలెడు లాభాలున్నాయి తెలుసా..

Published : Mar 19, 2022, 04:27 PM IST

Pista Benefits: మధుమేహులు క్రమం తప్పకుండా పిస్తా పప్పులను తింటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఇవి సహాయపడతాయి. 

PREV
18
పిస్తా పప్పులతో బోలెడు లాభాలున్నాయి తెలుసా..

Pista Benefits: పిస్తాల్లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

28

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు, జీర్ణవ్యవస్థ మెరుగు పడేందుకు పిస్తా పప్పులు ఎంతో సహాయపడతాయి. పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండే డ్రై ఫ్రూట్స్ లల్లో ఇవి కూడా ఒకటి. 

38

ఈ పప్పులను వంటకాల్లో చాలా తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తుంటారు. నిజానికి పిస్తా పప్పుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే.. 

48

కళ్ల ఆరోగ్యం: ఈ పప్పులో విటమిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం.  విటమిన్ ఎ ఎలాంటి కంటి సమస్యలనైనా ఇట్టే తగ్గిస్తుంది. కాబట్టి మీరోజు వారి ఆహారంలో వీటిని కూడా చేర్చుకోండి. 

58

గుండె ఆరోగ్యం: ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసు వారు సైతం గుండె నొప్పి, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. ఈ రోగాలు రాకూడదంటే ఖచ్చితంగా పిస్తాలను తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ పప్పుల్లో కార్డియో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. ఇవి ఎటువంటి గుండె జబ్బుల నుంచైన రక్షణ కల్పిస్తుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే వీటిని ఎక్కువ మొత్తంలో తినండి. 

68

క్యాన్సర్ నివారిణి: పిస్తా పప్పుల్లో కీమో నివారణా గుణాలుంటాయి.  ఈ పప్పులు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి క్యాన్సర్ బారిన పడకూడదంటే వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉండాలి. 

78

ఎముకలు బలోపేతం: ఎముకలు బలంగా ఉంటేనే శరీర స్థితి బగుంటుంది. అందుకే ఎముకలను బలంగా ఉంచే ఆహారాలను ఎక్కువగా తింటూ ఉండాలి. అయితే ఈ పిస్తాల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. అందుకే ముసలి వాళ్లు ఎక్కువగా పిస్తాలను తినాలని నిపుణులు చెబుతున్నారు. 

88

డయాబెటిక్ రోగులకు: మధుమేహ వ్యాధిగ్రస్తులకు పిస్తా సూపర్ డైట్ గా పనిచేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పప్పుల్లో జీవక్రియను మెరుగుపరిచే గుణం ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని ఎక్కువగా తింటూ ఉండాలి. 

Read more Photos on
click me!

Recommended Stories