స్టాబెర్రీలు తింటున్నారా.. అయితే ఈ రహస్యాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Published : Mar 19, 2022, 03:44 PM IST

ఎర్రగా చాలా అందంగా కనిపించే స్ట్రాబెర్రీలను (Strawberry) తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ఈ పండ్లను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మ సౌందర్యానికి (Skin beauty) కూడా అనేక లాభాలు కలుగుతాయని వైద్యులు అంటున్నారు.   

PREV
16
స్టాబెర్రీలు తింటున్నారా.. అయితే ఈ రహస్యాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Strawberry

స్ట్రాబెర్రీలో అనేక పోషకాలు (Nutrients) ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచే పండ్లు మాత్రమే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేసే అద్భుతమైన దివ్య ఔషధాలను కలిగిన పండ్లు. ఈ పండ్లను తీసుకుంటే చర్మ సంరక్షణ (Skin care) మెరుగుపడుతుంది. దీంతో చర్మ సమస్యలకు దూరంగా ఉండడంతో పాటు అందమైన చర్మ సౌందర్యం మీ సొంతమౌతుంది.
 

26
Strawberry

మృతకణాలను తొలగిస్తుంది: స్ట్రాబెర్రీలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు (Alpha hydroxy acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలలో పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగించి చర్మాన్ని శుభ్రపరిచి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. ఇందుకోసం స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసి చర్మానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుని శుభ్రపరుచుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

36
Strawberry

మచ్చలు తగ్గుతాయి: చర్మ సౌందర్యాన్ని పెంచే అనేక బ్యూటీ ఉత్పత్తులలో (Beauty products) స్ట్రాబెర్రీలను ఉపయోగిస్తారు. ఎందుకంటే స్ట్రాబెరీలలో సాలిసిలిక్ ఆమ్లం (Salicylic acid) ఉంటుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. కనుక స్ట్రాబెర్రీ పేస్ట్ ను అప్లై చేసుకుంటే చర్మ సౌందర్యం కోసం మీరు ఆశించిన ఫలితం మీ సొంతమవుతుంది.
 

46
Strawberry

ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుతుంది: వేసవికాలంలో అధిక ఎండ తీవ్రత కారణంగా చర్మానికి కలిగే హానిని తగ్గించడానికి స్ట్రాబెరీ సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలో ఎల్లాజిక్ ఆమ్లం (Ellagic acid), ఆంథోసైనిన్ సహా అనేక యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. కనుక చర్మ సౌందర్యం కోసం స్ట్రాబెర్రీ పేస్ట్ ను ఉపయోగిస్తే సూర్యకిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
 

56
Strawberry

కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గిస్తుంది: ఒక స్ట్రాబెర్రీని తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను పడుకునేటప్పుడు కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలు (Black circles) పైన పెట్టుకుని పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. అలాగే కంటి కింద ఉబ్బిన చర్మాన్ని (Puffy skin) కూడా తగ్గించడానికి సహాయపడుతాయి. 
 

66
Strawberry

పాదాల పగుళ్ళను నివారిస్తుంది: ఒక కప్పులో స్ట్రాబెర్రీ పేస్టు (Strawberry paste), గ్లిజరిన్ (Glycerin), ఓట్స్ పొడి (Oats dry) కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టి తర్వాత స్ట్రాబెరీ మిశ్రమాన్ని అప్లై చేసుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఈ మిశ్రమం పాదాలకు సహజసిద్ధమైన స్క్రబ్ గా పనిచేసి పాదాల పగుళ్ళను నివారిస్తుంది.

click me!

Recommended Stories