ఒక్క కౌగిలితో ఎన్నో విషయాలను తెలియజేయచ్చు. ఇష్టమైన వారిని గట్టిగా కౌగిలించుకుని వారిపై ఉన్న ప్రేమను తెలియస్తుంటారు. ఇక స్నేహితులపై ఉన్న ఇష్టాన్ని కూడా కౌగిలి ద్వారానే తెలియజేయొచ్చు.
కౌగిలి ఇష్టాన్ని, ప్రేమనే కాదు వారి బాధను కూడా తొలగిస్తుంది. నీకు నేనున్నా అనే భరోసాను కల్పిస్తుంది. కష్టసమయాల్లో ఉన్న వారిని హత్తుకుంటే వారికి ఎంతో ఓదార్పు లభిస్తుంది. ధైర్యాన్ని కూడా ఇస్తుంది.
ఈ కౌగిలింత పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఎంతో అవసరం. పేరెంట్స్ పిల్లలను ప్రేమగా హగ్ చేసుకుంటే వారికెంత భారోసా కలుగుతుందో తెలుసా. మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పేరెంట్స్ పిల్లలను హగ్ చేసుకుంటే వారి ఎదుగుదల బావుంటుందని చెబుతున్నారు.
parenting
ప్రేమగా వారిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే .. వారి కష్టం రాకుండా చూసుకునే వారున్నారన్న నమ్మకం వారిలో కలుగుతుందట.
పిల్లలు శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండేందుకు కేవలం వారికి పౌష్టికాహారం మాత్రమే కాదు.. తల్లిదండ్రులు తరచుగా హగ్ చేసుకోవాలంట. దీనివల్ల వారి మెదడు పనితీరు మెరుగు పడుతుంది. అంతేకాదు వారి ఆలోచనా విధానం కూడా బాగుంటుందట. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి కూడా.
కొన్ని కొన్ని సమయాల్లో పిల్లలు తుంటరి పనులను చేస్తుంటారు. అలాంటి సమయాల్లో వారిని కొట్టడమో, తిట్టడమో చేయకుండా వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకోవాలట. దీనివల్ల పిల్లలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి వారి మూడ్ మారుతుందట.
ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా.. పిల్లలను తరచుగా హత్తుకుంటే వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
parenting
పిల్లలు అనారోగ్యం బారిన పడ్డప్పుడు లేదా వారికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటే వాటినుంచి తొందరగా బయటపడతారట.
ఇకపోతే పిల్లలను ఏ విషయం గురించైనా మెచ్చుకోవాలనుకుంటే వారిని ప్రేమగా కౌగిలించుకోండి. దీంతో వారు ఎంతో సంతోషిస్తారు. ఇది వారిలో సానుకూల ఆలోచనలు వచ్చేలా చేస్తుంది కూడా.
Parenting
పిల్లలను కుటుంబ సభ్యులు తరచుగా కౌగిలించుకునే, లేదా ఎక్కువ ప్రేమను పొందే పిల్లలు తమ భావోద్వేగాలను కూడా కంట్రోల్ చేసుకోగలరని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పిల్లలు చెడు వ్యసనాల వైపు మల్లే అవకాశం ఉండదు.