Mulberry Fruit : మల్బరీ పండ్లతో ఆ సమస్యలన్నీ దూరం..

Published : Mar 21, 2022, 11:52 AM IST

Mulberry Fruit : మల్బరీ పండ్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. అంతేకాదు వీటితో హార్ట్ స్ట్రోక్ , హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి. అంతేకాదు ఈ పండ్లు జీర్ణవ్యవస్థ ను మెరుగుపరుస్తాయి.   

PREV
15
Mulberry Fruit : మల్బరీ పండ్లతో ఆ సమస్యలన్నీ దూరం..
mulberry

మల్బరీ చెట్టను ప్రత్యేకంగా పట్టుపరుగుల ఆహారం కోసమే పెంచుతుంటారు. అయితే ఈ చెట్లకు కాసే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తారు. కానీ వీటిని చాలా వరకు ఎవరూ తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఈ మల్బరీ పండ్లను సలాడ్స్, జెల్లీలు, షర్భత్ లల్లో వేస్తుంటారు. ఈ పండ్లలో ఉండే పోషకాలు డయాబెటిస్, అర్థరైటిస్, గుండె జబ్బులను నయం చేయానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. 

25
mulberry

మల్బరీ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు:  వీటిల్లో రెస్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతో సహాయపడుతాయి. అంతేకాదు ఇది హాట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, రక్తం గడ్డకట్టే ప్రమాదాలను నివారిస్తుంది. అలాగే ఈ పండ్లు మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తొలగించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

35
Mulberry

రోజులో పది మల్బరీ పండ్లను తింటే ఆ రోజుకు మన శరీరానికి కావాల్సిన పీచుపదార్థం లభిస్తుంది. నిత్యం కొన్ని మల్బరీ పండ్లను తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ మల్బరీ పండ్లతో తిమిర్మి, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. 

45
Mulberry

ఈ మల్బరీ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు మన శరీర కణాలకు ఆక్సిజన్ వేగంగా చేరుతుంది. మన రోజు ఆహారంలో మల్బరీ పండ్లను చేర్చుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు మధుమేహం వల్ల బరువుపెరిగే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

55
Mulberry

ఈ పండ్లలో ఉండే విటమిన్ ఏ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనివల్ల మన బాడీ బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉండదు.  అంతేకాదు విటమిన్ ఎ వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.. వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే ముఖంపై ముడతల సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.  కాలెయ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి. 

Read more Photos on
click me!

Recommended Stories