రోజూ స్నానం చేయకపోయినా పర్లేదు కానీ.. ఈ 3 భాగాలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలంటున్న నిపుణులు.. ఎందుకంటే..?

Published : Mar 21, 2022, 09:54 AM IST

ప్రతి రోజూ స్నానం చేయకపోయినా.. ఏమీ కాదు కానీ.. చంకలను, పాదాలను, గ్రోయిన్స్ ను ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..? 

PREV
18
రోజూ స్నానం చేయకపోయినా పర్లేదు కానీ.. ఈ 3 భాగాలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలంటున్న నిపుణులు.. ఎందుకంటే..?

క్రమం తప్పకుండా స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ స్నానం చేయడం వల్ల ఎన్నో రోగాలను తరిమికొట్టొచ్చు కూడా.  అందుకే కాలాలతో సంబంధం లేకుండా స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. 
 

28

పలు నివేధికల ప్రకారం.. ప్రతిరోజూ స్నానం చేయడం ఎంతో అవసరం. స్నానం చేయకపోవడం వల్ల ఆరోగ్యానికి హానీ చేసే బ్యాక్టీరియా మన శరీరానికి అంటుకుని చర్మం దురదగా, మంట చికాకు పుడుతుంది.

38

అయితే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ స్నానం చేయకపోయినా పర్లేదు కానీ.. శరీరంలోని ఈ మూడు భాగాలను మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

48

చంకలు (Armpits): మీకు చెమట ఎక్కువ పడుతున్నట్టైతే.. స్కిన్ పై బ్యాక్టీరియా చేరి బ్యాడ్ స్మెల్ వచ్చేలా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా పెరిగిపోతే మాత్రం చంకల్లోని చర్మం ముడతలు పడుతుంది. దీనివల్ల మీ చంకల్లో బ్యాడ్ స్మెల్ రావడంతో పాటుగా దురద, మంట పుడుతుంది. ఈ సమస్యలన్నీ రాకూడదంటే మీరు ఖచ్చితంగా మీ చంకలను ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాల్సిందే. దీనివల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. చర్మ సమస్యలు కూడా రావు. 

58

Groin(గజ్జలు):  ప్రతిరోజూ స్నానం చేయలేను అనుకునే వారు.. నిత్యం మీ గజ్జల (Groin) ప్రాంతాన్ని మాత్రం క్లీన్ చేసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు. అంతేకాదు లో దుస్తులను కూడా మార్చుకోవాల్సిందే. జననేంద్రియాల చుట్టూ ఉన్న చర్మం, హెయిర్ లో చెడు బ్యాక్టీరియా మిలియన్ల కొద్దీ ఉంటుందట. దీనివల్ల అక్కడ దుర్వాసనతో పాటుగా ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. అంతేకాదు దీనివల్ల ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రైవేట్ భాగాలను గోరువెచ్చని నీళ్లు సబ్బుతో క్లీన్ చేసుకోండి. 

68

పాదాలు: నిత్యం శుభ్రం చేయాల్సిన భాగాల్లో పాదాలు కూడా ఒకటి. కానీ చాలా మంది పాదాలను అస్సలు క్లీన్ చేయరు. నిత్యం స్నానం చేసేవారు కూడా శరీర భాగాలన్నింటినీ స్క్రబ్ చేసినా.. పాదాలను మాత్రం మర్చిపోతుంటారు. కానీ ఇతర భాగాల కంటే పాదాలనే ఎక్కువగా క్లీన్ చేయడం ఎంతో అవసరం. ముఖ్యంగా సాక్సులు వేసుకునే  వారి పాదాల నుంచి దుర్వాసన రాకూడదంటే.. వాటిని స్క్రబ్ చేయడం ఎంతో అవసరం. 
 

78

నిత్యం శుభ్రం చేయాల్సిన ఇతర భాగాలు:  ప్రతి రోజూ మనం స్నానం చేస్తున్నప్పటికీ.. కొన్ని భాగాల పట్ల మరింత కేరింగ్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. చంకలు, పాదాలు, గజ్జలతో పాటుగా మరికొన్ని భాగాలకు కూడా హానీచేసే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. వాటిని కూడా క్లీన్ చేయాలి. 

88

అవేంటంటే.. మెడ వెనక భాగం, బొట్టు బటన్, వేలి గోరికింది భాగం, చెవుల వెనుక మర్చిపోకుండా శుభ్రం చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. ఈ  భాగాల్లో కూడా బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. 

click me!

Recommended Stories