చలికాలంలో దగ్గు, జబులు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డ్రై స్కిన్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందుకు ఒక కారణం ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తగ్గడం. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ చలికాలంలో పుష్కలంగా లభించే పండ్లలో ఆలు బుకరా పండ్లు ఒకటి. ఈ సీజన్ లో ఈ పండ్లు ను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఆలు బుకరా పండ్లతో కేకులు, ఊరగాయలు, జామ్ లు, ఇతర స్వీట్లను తయారుచేస్తారు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను, రక్తప్రసరణను పెంచడానికి సహాయపడతాయి. ఈ శీతాకాలంలో ఆలు బుకరా పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..