Health tips : ఈ భూమ్మిదున్న అన్ని ప్రాణులకు అత్యంత విలువైనది, అన్నింటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే అది నీరనే చెప్పాలి. ఆహారం లేకుండా నైనా కొన్ని రోజులు కాలాన్ని వెళ్లదీయొచ్చు గానీ నీరు లేకుండా ఒక్కరోజుకంటే ఎక్కవ సమయం జీవించలేని జీవులున్నాయి. అందుకే ఈ నీరు సకల ప్రాణులకు ప్రాణాధారమైంది. కానీ చాలా మంది పని హడావుడిలో పడో లేక నీటిని తాగాలనిపించకనో నీళ్లను బొత్తిగా తాగడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్లే శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అంతే కాదు కిడ్నీల్లో రాళ్లు అలాగే ఇతర అనారోగ్య సమస్యలు నీళ్లు తాగకపోవడం వల్లే వస్తాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నీళ్లను తాగని వారు లేకపోలేదు. అంతెందుకు కొంతమంది తినేటప్పుుడు మాత్రమే రెండు మూడు బుక్కల నీటిని తాగుతారు. ఇలాంటి వారు రోజు మొత్తంలో ఒక లీటర్ నీటిని కూడా తాగరేమో. అయితే శరీరానికి కావాల్సిన నీటిని తీసుకుంటేనే అధిక బరువు, ఇతర రోగాల నుంచి తప్పించుకోగలం. ఒకవేళ నీటిని తాగాలనిపించకపోతే.. దానిని పరిష్కార మార్గాలు చాలానే ఉన్నాయి.