వృద్ధాప్యంలో సెక్స్ చెయ్యడం మంచిదేనా.. శరీరానికి కలిగే నష్టాలు లాభాలు ఇవే!

First Published | Jan 29, 2022, 4:53 PM IST

దాంపత్యజీవితంలో సెక్స్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఆలుమగల సంపూర్ణమైన సెక్స్ జీవితం వారి ఆరోగ్యానికి (Health) కూడా సహాయపడుతుంది. సెక్స్ లో పాల్గొనడానికి వయసుతో సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. మరి వృద్ధాప్య వయస్సులో సెక్స్ (Sex in old age) మంచిదేనా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

వయసుతో సంబంధం లేకుండా లైంగిక కోరికలు (Sexual desires) ఉన్నంత వరకు, వారి శరీరం ఆ కార్యానికి సహకరిస్తుంటే (Cooperating) ఎటువంటి సందేహం లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చు. చురుకైన సెక్స్ జీవితం దంపతుల జీవితకాలాన్ని పెంచుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యల ఇబ్బందులు లేనప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆ కార్యంలో పాల్గొనవచ్చును. అప్పుడే వారు సంపూర్ణమైన శృంగార జీవితాన్ని ఆస్వాదించగలరు.
 

ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో వృద్ధాప్య వయసులో కూడా క్రమం తప్పకుండా లైంగిక క్రియలో పాల్గొనే వారు మంచి ఆరోగ్యంతో ఉన్నారని తేలింది. చురుకైన లైంగిక జీవితంతో మంచి జీవితం గడుపుతున్న ఆనందం, ఆరోగ్యంగా ఉన్నామన్న సంతృప్తి (Satisfaction) వారిలో కనిపిస్తోందని పరిశోధకులు అంటున్నారు. లండన్ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు ముందు సంవత్సరంలో సెక్స్ లో పాల్గొన్న 65 ఏళ్లు పైబడిన వారిపై పరిశోధన (Research) చేపట్టింది.
 


వారు గడుపుతున్న సెక్స్ జీవితం పట్ల ఎక్కువ సంతృప్తిగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.  అయితే చురుకైన సెక్స్ జీవితం పురుషుల్లోనూ, మహిళల్లోనూ ఒకే విధంగా ఉండదట. మహిళలు సున్నితమైన చుంబనం (Kissing), స్పర్శ (Touch) వంటి వాటిని లైంగిక ప్రక్రియ కన్నా ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట. కానీ పురుషులు మాత్రం పూర్తిస్థాయి లైంగిక ప్రక్రియనే ఎక్కువగా ఇష్టపడుతారట.
 

వృద్ధాప్య వయసులో కూడా శృంగారంలో పాల్గొనే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు (Illness issues) లేకుండా గుండె ఆరోగ్యంగా (Heart healthy) ఉందని శృంగార నిపుణులు చెబుతున్నారు. వీరు 65 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. వీరి ఆరోగ్య రహస్యానికి సంపూర్ణమైన సెక్స్ జీవితమే కారణమట.
 

వృద్ధాప్య వయసులో కూడా సెక్స్ లో పాల్గొంటే ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా సెక్స్ కోరికలను (Sex cravings) అనుచుకుంటే వారి జీవితకాలం తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఇతరుల గురించి ఆలోచించకుండా సెక్స్ లో పాల్గొంటూ సంపూర్ణమైన సెక్స్ జీవితాన్ని అనుభవిస్తూ (Enjoying) ఆరోగ్యంగా ఉండడం మంచిదని శృంగార నిపుణులు చెబుతున్నారు.
 

వైద్యులు వృద్ధాప్య సమస్యలతో వచ్చే పేషంట్ ల సెక్స్ జీవితం గురించి తెలుసుకుని వారికి చురుకైన లైంగిక జీవితానికి అవసరమైన సలహాలను (Suggestions) ఇవ్వడం మంచిది. దాని కారణంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చూసారా సెక్స్ లో పాల్గొనడానికి వయస్సుతో సంబంధం లేదు. మీలో సెక్స్ కోరికలు ఉన్నంతవరకు, అలాగే శరీరం అనుకూలిస్తుంటే ఎటువంటి సందేహం (Doubt) లేకుండా సెక్స్ లో పాల్గొనవచ్చు.

Latest Videos

click me!