
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తివంతమైన మసాలా దినుసు. నిజానికి కుంకుమపువ్వును ఒక్క గర్భిణులే కాదు.. ఇతరులు కూడా తినొచ్చు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కుంకుమ పువ్వును తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. లిబిడో స్థాయిలు పెరుగుతాయి. లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాదు ఇది అలర్జీలను కలిగించదు. అందుకే దీన్ని అందరూ తీసుకుంటారు. అయితే, కుంకుమపువ్వు చాలా ఖరీదైంది. అందుకే చాలా మంది దీనిని ఉపయోగించరు. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
చలికాలంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ ఎరుపు రంగు మసాలాలో చెప్పలేనన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మం, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు కుంకుమపువ్వును తీసుకోవడం వల్ల మీరు మీ వయస్సు కంటే 10 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు. నిత్య యవ్వనంగా కనిపించడానికి ఇది బాగా సహాయపడుతుంది.
కుంకుమపువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు
కుంకుమపువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇది చర్మం ముడతలను తగ్గించి.. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది. కుంకుమపువ్వులో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. క్రోసిన్, క్రోసెటిన్ అనే శక్తివంతమైన కెరోటినాయిడ్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి.
ఆడవాళ్లకు కుంకుమ పువ్వు మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో కుంకుమపువ్వును తీసుకోవడం వల్ల పొత్తికడుపు నొప్పి తగ్గిపోతుంది. మూడ్ మార్పులను కూడా నివారిస్తుంది. తిమ్మిరిని తగ్గిస్తుంది.
కుంకుమ పువ్వు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి కోరికలు తగ్గుతాయి. దీంతో మీరు అతిగా తినలేరు.
కుంకుమ పువ్వు ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రాత్రిళ్లు మీరు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది
ఎలా వినియోగించాలి
రెండు మూడు కుంకుమపువ్వులను తీసుకుని పాలు లేదా మూలికా టీలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే నానబెట్టిన కుంకుమపువ్వును ఉదయం ఖాళీ పరిగడుపున తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ఒక కప్పులో నీళ్లలో రెండు మూడు కుంకుమపువ్వులను వేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి.