Summer tips: వేసవి కాలంలో బయట తిరగకుండా ఇంట్లో ఉంటే లాభమా? నష్టమా?
రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. మరి వేసవిలో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. మరి వేసవిలో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. వేడి వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉండటమే ఆరోగ్యానికి మంచిదని అందరూ అనుకుంటారు. నిజానికి ఇంట్లో ఉండడం వల్ల కొన్ని లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
- ఇంట్లో ఉండడం వల్ల సూర్యుడి వేడి, యూవీ కిరణాలు, వడదెబ్బల నుంచి తప్పించుకోవచ్చు.
- ముఖ్యంగా చర్మ సమస్యలు రావు. సాధారణంగా బయట ఎక్కువసేపు ఉండడం వల్ల సూర్యుడి వేడి తగిలి చాలా రకాల చర్మ సమస్యలు వస్తాయి.
- ఇంటి వాతావరణం బాగుండటం వల్ల ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి కలుగుతుంది.
- వేడికి భయపడి ఇంట్లో ఉంటే శారీరక శ్రమ తగ్గుతుంది.
- సూర్యుడి నుంచి తగినంత విటమిన్ డి అందకుండా పోతుంది.
- ఒకే చోట ఎక్కువసేపు ఉంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
- వేడి ప్రభావం వల్ల ఆహారపు అలవాట్లు, నిద్ర దెబ్బతినవచ్చు.
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ:
పుచ్చకాయ, దోసకాయ, కర్బూజ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. నూనె, కారంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం తగ్గించాలి. శరీరానికి శక్తినిచ్చే డ్రింక్స్ తాగండి. ముఖ్యంగా రోజుకు 3 నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి.
వ్యాయామం:
వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేయాలి. వాకింగ్, స్కిప్పింగ్, యోగా లాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. వ్యాయామం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే శరీర వేడి తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యం:
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఇంట్లో సమయాన్ని ఉపయోగకరంగా గడపడానికి పుస్తకాలు చదవడం లాంటి మీకు ఇష్టమైన పనులు చేయవచ్చు. లేదంటే కుటుంబంతో కాసేపు గడపండి.
ఉదయం, రాత్రి వేళల్లో ఇంటి కిటికీలు తెరిచి ఉంచవచ్చు. సూర్యరశ్మి నుంచి తప్పించుకోవడానికి కర్టెన్లు వాడవచ్చు. ఇది వేడి లోపలికి రాకుండా చేస్తుంది.
గమనిక:
ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా కళ్లద్దాలు, టోపీ లాంటివి వాడటం మర్చిపోకండి.