ఈ రోజు అటుకుల బతుకమ్మ.. దీని స్పెషలేంటో తెలుసా?

First Published Oct 15, 2023, 3:37 PM IST

Bathukamma 2023: ప్రతి ఏడాది ఆశ్వీయుజశుద్ధ అమావాస్య నాడు బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. నిన్న మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ అయిపోయింది. ఈ రోజు అటుకుల బతుకమ్మ. ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Bathukamma 2023

Bathukamma 2023: నిన్నే బతుకమ్మ పండుగ మొదలైంది. ఈ రోజు నవరాత్రలు కూడా స్టార్ట్ అయ్యాయి. నవరాత్రలతో పాటుగా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగ ఏ రోజుకారోజు ఎంతో ప్రత్యేకం. 

Bathukamma 2023

నిన్నే బతుకమ్మ పండుగ స్టార్ట్ అయ్యింది. నిన్న ఎంగిలి బతుకమ్మను జరుపుకుంటే ఈ రోజు అటుకుల బతుకమ్మను జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వానాకాలం ఎండింగ్ లో చలికాలం స్టార్టింగ్ లో వస్తుంది. వార్షాకాలం వర్షాలతో ఇప్పటికే ఊర్లలో ఉన్న చెరువులు, కుంటలు, బావులన్నీ నీటితో నిండుకుండలా మారిపోయాయి. దీంతో బీడు భూములన్నీ తీరొక్క పూలతో కలకలలాడుతుంటాయి. మీరు గమనించారో లేదో మనం బతుకమ్మలను స్థానికంగా దొరికే పూలతోనే బతుకమ్మను పేరుస్తారు. 
 

ఈ సీజన్ లో గునుగు పూలు, తంగేడు పూలు, తామర పువ్వులు, నందివర్ధనం పువ్వులు బాగా విరబూస్తాయి. అంతేకాదు బంతిపువ్వులు కూడా ఈ సీజన్ లో బాగా పండిస్తారు.  రకరకాల పువ్వులతో ఆడవాళ్లు బతుకమ్మను ఎంతో అందంగా పేరుస్తారు. 
 

ఈ పండుగ ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకమైంది. బతుకమ్మ పండుగ వస్తుందంటే ఆడవాళ్లకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఏడున్న పువ్వునైనా తెచ్చి పోగేసే బతుకమ్మను పేరుస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగలో ఆడవాళ్లంతా రోజూ బతుకమ్మను చేసి ఆడి పాడుతారు. 
 

బతుకమ్మ పండుగ ఎంగిలి బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. చివరి రోజు బతుకమ్మను పెద్దగా పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మపై పసుపుతో చేసిన గౌరమ్మను ఇంటికి తెస్తారు. వీటిని పెళ్లైన ఆడవారు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటారు. దీంతో వీరి దాంపత్య జీవితం బాగుంటుందని నమ్ముతారు. సౌభాగ్యవతిగా ఉంటారని నమ్ముతారు.

ఇకపోతే నిన్న ఎంగిలి బతుకమ్మ అయిపోయింది. ఈ రోజు అటుకల బతుకమ్మను జరుపుకోబోతున్నాం. ఈ రోజు నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే అటుకుల బతుకమ్మకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంగిలి బతుకమ్మ తర్వాత బతుకమ్మను పిల్లలే  తయారుచేసి ఆడేవారట. ఇక ఈ రోజు బెల్లం, అటుకులను నైవేద్యంగా పెట్టేవారట. అందుకే  రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తున్నారట.

click me!