Basil Water Benefits: తులసి నీళ్లు తాగితే ఇంత మంచి జరుగుతుందా..?

First Published Jun 24, 2022, 4:58 PM IST

Basil Water Benefits: తులసి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున తులసి నీళ్లను తాగితే ఎన్నో జబ్బులు తగ్గిపోతాయి.. 

తులసి (Basil)ని అనాదిగా జలుబు, ఫ్లూ నుంచి బయటపడటానికి ఉపయోగిస్తున్నారు. తులసి (Basil)లో చాలా పోషకాలు ఉంటాయి. అందులోనూ తులసి ఆకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కావు. ఇవి ఎన్నో రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే తులసి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తులసిలో క్రియాశీల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీర పని తీరును Detoxification చేయడానికి కూడా సహాయపడతాయి.
 

తులసిలో యాంటీట్యూసివ్ (Antitussive)లక్షణాలు ఉంటాయి. ఇది దగ్గును తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది. తులసిలో అనేక అలెర్జీ, శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి సాధారణ జలుబు (Cold), సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

డయాబెటిస్ రోగులు ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం మంచిది. తులసి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తులసిలో 'యూజెనాల్' అనే పదార్ధం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బిపిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

తులసి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. తులసి నీరు కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని చెబుతున్నాయి.

తులసి నీళ్లు తాగడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.  అలాగే ఒత్తిడి సమస్య కూడా పోతుంది.  ఆందోళన, నిరాశ వంటి లక్షణాలను తొలగించడంలో తులసి నీళ్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

click me!