
అరటిపండులో అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే అద్భుతమైన పండు. అధిక పొటాషియం, విటమిన్ సి, బి 6 లతో అనేక పోషకాలతో కూడిన అరటిపండ్లు జుట్టు, చర్మం రెండింటికీ ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం పొడి చర్మానికి, పొడి జుట్టుకు పోషణనిస్తుంది. అందుకే అరటిపండు మీ అందానికి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు బ్యూటీ నిపుణులు.
తొక్క ఈజీగా తీయొచ్చు, తినడం సులభం, మాష్ చేయడం సులభం. అందుకే ఈ పండుతో ఏది చేయాలన్నా చాలా తేలిక. అరటి గుజ్జును జుట్టు, ముఖం రెండింటికి ప్యాక్ లాగా అప్లై చేయవచ్చు. అరటి పండులో రిస్టోరింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. ఇది కెమికల్ ట్రీట్మెంట్లు, పదేపదే రంగు వేయడం వలన జుట్టుకు కలిగే నష్టాన్ని నివారిస్తుంది.
అరటి పండు చర్మానికి మంచి పోషణనిస్తుంది. దీంతోపాటు చర్మం సాగకుండా బిగినిస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అరటిపండు గుజ్జును ప్యాక్ లా వేసుకునే ముందు దీనికి పెరుగు కలపాలి. పొడి జుట్టు ఉన్నవారు ఈ ప్యాక్ కు పెరుగు కలపాలి. దీంతోపాటు ఒక టీస్పూన్ స్వచ్ఛమైన గ్లిజరిన్ లేదా తేనెను కూడా కలపొచ్చు. బాదం నూనె కూడా మీ జుట్టుకు ఇలాంటి ఫలితాన్ని అందిస్తుంది. ఈ ప్యాక్ వల్ల జుట్టుకు పోషణతో పాటు, ఆరోగ్యకరంగా, మెరిసేలా తయారవుతుంది.
బ్యూటీ గురూ షహనాజ్ హుస్సేన్ అరటి పండు ప్రయోజనాల గురించి మాట్లాడుతూ... "మా సెలూన్లలో ఫేషియల్ ట్రీట్మెంట్లలో భాగంగా, ఫేస్ మసాజ్ తరువాత ఫ్రూట్ ఫేషియల్ సజెస్ట్ చేస్తాం. కస్టమర్‌లు ఎక్కువగా అరటి పండు ఫేషియల్ నే కోరుకుంటారు. అంటే ఈ పండులోని సుగుణాలు మాకు అర్థం అయ్యాయి. ”అని హుస్సేన్ చెప్పుకొచ్చారు.
" జుట్టు కోసం కూడా అరటి పండు ప్యాక్‌లను ఉపయోగిస్తాం. దీనికోసం ముందుగా గుజ్జును తయారు చేస్తాం, ఆ తరువాత దీన్ని పెట్టేముందు పెరుగు, తేనె కలుపుతాం. దీనివల్ల జుట్టు కు చక్కటి క్లెన్సింగ్ తో పాటు, రివైటలైజింగ్ ప్రభావం కూడా ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది, మృదువుగా చేస్తుంది. విటమిన్ సి, బి అధికంగా ఉన్నందున జుట్టుకు మెరుపును అందిస్తుంది ”అన్నారామె.
అందానికి అరటిపండును ఎలా వాడుకోవాలో.. ఆమె కొన్ని టిప్ప్ చెబుతున్నారు..
ప్యాక్ ఎలా ఉపయోగించాలి - అరటిగుజ్జుకు పెరుగు, తేనె కలపాలి. ఈ మూడింటిని బాగా మెత్తటి పేస్టులా చేయాలి. ఆ తరువాత జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత కడిగేయాలి.
ఇదే ప్యాక్ ను ముఖానికి కూడా ఉపయోగించవచ్చు. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు మృదువైన, బిగుతైన చర్మం దీనివల్ల మీకు కలుగుతుంది. అరటిపండు ఇతర పండ్లతో తొందరగా కలిసిపోతుంది. ఫ్రూట్ ఫేస్ లేదా హెయిర్ ప్యాక్ కు వేరే పండ్లను కూడా కలపడం ద్వారా మీకు కావాల్సిన ప్రయోజనాలను పొందవచ్చు. దీనికోసం పండిన బొప్పాయి గుజ్జును కలపొచ్చు. లేదా తురిమిన ఆపిల్, నారింజ గుజ్జును కూడా కలపొచ్చు.
ఇదే ప్యాక్ ను ముఖానికి కూడా ఉపయోగించవచ్చు. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు మృదువైన, బిగుతైన చర్మం దీనివల్ల మీకు కలుగుతుంది. అరటిపండు ఇతర పండ్లతో తొందరగా కలిసిపోతుంది. ఫ్రూట్ ఫేస్ లేదా హెయిర్ ప్యాక్ కు వేరే పండ్లను కూడా కలపడం ద్వారా మీకు కావాల్సిన ప్రయోజనాలను పొందవచ్చు. దీనికోసం పండిన బొప్పాయి గుజ్జును కలపొచ్చు. లేదా తురిమిన ఆపిల్, నారింజ గుజ్జును కూడా కలపొచ్చు.
బొప్పాయిలో ఎంజైమ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనివల్ల తలలోని చుండ్రుని శుభ్రం చేయడానికి అద్భుతమైన ఏజెంట్‌గా చేస్తుంది. ఆరెంజ్‌లో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి మీ ప్యాక్ ను బ్యాలెన్స్ చేయాలనుకుంటే అరటిపండులో చేర్చడానికి ఇది బాగుంటుంది.
ఆపిల్ లోని పెక్టిన్ కారణంగా అరటిపండ్లతో కలిపినప్పుడు గొప్ప టోనింగ్ మరియు శుభ్రపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అరటిపండు శరీరానికి మాత్రమే కాకుండా చర్మం, జుట్టుకు కూడా అత్యంత పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి అని చెప్పడం సురక్షితం.