రోడ్లపై పానీపూరి ఎందుకు.. ఇంట్లోనే నోరూరించే పానీపూరీని ఇలా చేద్దాం?

First Published | Oct 5, 2021, 12:27 PM IST

ఎంత మంచి ఫుడ్డు ఎంత కాస్ట్ లీ ఫుడ్డు తినేవాళ్ళు అయినా రోడ్డుపై దొరికే పానీపూరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపాల్సిందే. ఎందుకో తెలియదు పానీపూరీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. 

ఎంత మంచి ఫుడ్డు ఎంత కాస్ట్ లీ ఫుడ్డు తినేవాళ్ళు అయినా రోడ్డుపై దొరికే పానీపూరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపాల్సిందే. ఎందుకో తెలియదు పానీపూరీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నిజానికి పానీపూరీ అమ్మే వ్యక్తి కూడా క్షణం కూడా తీరిక లేకుండా ఉంటాడు. అంటే పానిపూరీ బండి దగ్గరికి అలా ఎగబడతారు అన్నమాట.
 

ఇక గత ఏడాది కరోనా సమయంలో ఇటువంటి చాట్ ఫుడ్ లాంటివి రోడ్లపై దొరకడం చాలా కష్టం అయ్యాయి. దాంతో చాలామంది ఇంట్లోనే ఉంటూ కొన్ని కొన్ని చాట్ పదార్థాలను స్వయంగా తయారు చేసుకొని మరి ఆరగించారు. నిజానికి ఈ పానీపూరీ చేయడం చాలా సులువు. కావాలంటే అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 


 కావలసిన పదార్థాలు: ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే చల్లని నీళ్లు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ (ఖర్జూర), చింతకాయతో చేసిన చట్నీ, చాట్ మసాలా పొడి, జిలకర్ర పొడి, కారం, పూరీలు, బూంది.
 

 తయారు చేసుకునే విధానం: ఒక గిన్నెలో నీళ్లలో సిద్ధంగా ఉంచుకున్న గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇక దీన్ని ఒక గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇందులో సరిపడు బూంది వేస్తే మసాలా నీరు సిద్ధమైనట్లే.
 

చాట్ కోసం కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కారం, జిలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, పెసరపప్పు గుండ్లు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర.
 

తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలు గడ్డలు ఉడక పెట్టి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, కారం, జిలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి కలుపుకోవాలి.
 

ముందు రోజు రాత్రే పెసరపప్పు లేదా పచ్చిశెనగ  నానబెట్టాలి. మరుసటి రోజు వాటిని ఉడకబెట్టి అందులో వడబోసి అందులో సరిపడా పసుపు, ఉప్పు వేసి కలపాలి. అంతే చాట్ కూడా రెడీ అయిపోయింది. ఇక దీనిని ఎలా తినాలో అందరికీ తెలిసిందే.

Latest Videos

click me!