3. కండరాల అలసటను తగ్గిస్తుంది
కండరాల పనితీరుకు నీటి శాతం చాలా ముఖ్యం. బేకింగ్ సోడా కండరాల శక్తిని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు బేకింగ్ సోడా నీళ్ళు తాగితే కండరాల అలసట తగ్గి, ఎక్కువ సేపు వ్యాయామం చేయడానికి సహాయపడుతుంది.
4. అలెర్జీ సమస్యలకు మంచిది
బేకింగ్ సోడాలో అలెర్జీ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇది శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
బేకింగ్ సోడా నీటి దుష్ప్రభావాలు:
బేకింగ్ సోడా నీళ్ళు శరీరంలోని సహజ pH స్థాయిని దెబ్బతీసి, మెటబాలిక్ డిజార్డర్‌కు దారితీస్తుంది. మీ రక్తం, శరీర ద్రవాలలో ఆల్కలీన్ లేదా క్షారాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. దీనివల్ల చిరాకు, కండరాల నొప్పులు, కండరాల సంకోచాలు, అలసట , గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి.