ప్రతి పేరెంట్స్ తమ పిల్లల గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. వారికి మంచి నేర్పించాలనే అనుకుంటారు. కానీ, మూడు విషయాల్లో మాత్రం పిల్లలను బలవంత పెట్టకూడదు. అది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందట. మరి, అవేంటో తెలుసుకుందాం...
పిల్లలను బాగా పెంచాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అది వారి బాధ్యత కూడా. అందుకే చిన్నతనం నుంచే చాలా విషయాలను పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదైనా విషయం పిల్లలు నేర్చుకోలేకపోతే పేరెంట్స్ బలవంత పెడుతూ ఉంటారు. మనం బలవంత పెట్టడం వల్ల అవి నేర్చుకొని వారికి మంచి జరగొచ్చు. కానీ.. క్రమశిక్షణ పేరుతో కొన్ని విషయాల్లో మాత్రం పిల్లలను పేరెంట్స్ బలవంత పెట్టకూడదట. అలా బలవంతం చేయడం వల్ల వారి భవిష్యత్తుకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. మరి, ఎలాంటి విషయాల్లో బలవంతం చేయకూడదో తెలుసుకుందాం...
27
మీ కోరికలు పిల్లలపై రుద్దడం..
పిల్లల చిన్న విషయాల్లో కూడా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. వారి ప్రవర్తన సరిగ్గా గమనించకపోతే తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కానీ క్రమశిక్షణ వేరు, మీ కోరికలను పిల్లలపై రుద్దడం వేరు. మీ కోరికలను పిల్లలపై బలవంతం చేయకండి. పిల్లల కోరికలను అణచివేయకూడదు. వారి కోరికలను అడ్డుకుని మీ కోరికలు తీర్చుకోవడం తప్పు. ఇది వారి జీవితంలో మానని గాయంగా మారుతుంది. ఇలా చేస్తే పిల్లలు మీ నుంచి దూరం కావడం మొదలవుతుంది. ఒకానొక సమయంలో మిమ్మల్ని శత్రువుగా కూడా భావించవచ్చు.
37
విద్య:
విద్య విషయంలో మీ పిల్లల కోరికలను గౌరవించాలి. వారు ఏం చదవాలనుకుంటున్నారో ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉండాలి. ఉదాహరణకు పదో తరగతి చదివే పిల్లలు ఆ తర్వాత ఆర్ట్స్ వైపు వెళ్లాలనుకోవచ్చు. వారి భవిష్యత్తు గురించి కలలు కంటుండవచ్చు. కానీ తల్లిదండ్రులు ఆ కోరికను గౌరవించకుండా బలవంతం చేస్తే సైన్స్ గ్రూప్ ఎంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల వారి కలను మరచిపోయి వేరే రంగంలో చదవాల్సి వస్తుంది.
47
అవగాహన
ఇలా చదివి మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నా కూడా తాము అనుకున్నది చేయలేకపోయామనే బాధ వారి మనసులో ఉంటుంది. వారికి సంతృప్తి ఉండదు. దీనివల్ల తల్లిదండ్రులపై కోపం, అసంతృప్తి కూడా కలగవచ్చు. ఇలా పిల్లల కోరికలను పక్కన పెట్టి తమ కోరికలు తీర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకోకూడదు. సమాజం, బంధువులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడం పిల్లల మనసును బాధించే అతిపెద్ద కారణం అవుతుంది. పిల్లల కోరికలను, ఆశలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వారితో మాట్లాడి వారి మనసును అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడం వల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అవగాహన, మంచి అనుబంధం ఏర్పడుతుంది. పిల్లలు తమ భవిష్యత్తును సంతోషంగా గడపడానికి ఇది దోహదపడుతుంది.
57
ఉద్యోగం:
పిల్లలు తమకు నచ్చిన ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండాలి. దాన్ని ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు అడ్డుకోకూడదు. మీకు నచ్చిన రంగం, మీరు చేయాలనుకున్న ఉద్యోగాన్ని మీ పిల్లలు చేయాలని బలవంతం చేయకూడదు. వారు ఎంచుకునే ఉద్యోగం చేసుకునే హక్కు, స్వేచ్ఛ వారికి ఉందని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో వారిని బలవంతం చేస్తే మీకు, వారికి మధ్య దూరం పెరుగుతుంది.
67
పెళ్లి:
పెళ్లి విషయంలో కూడా పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదు. వారు మరీ చిన్న పిల్లలు కాదని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పెళ్లి ఒత్తిడి వల్ల వారు ఇష్టం లేకుండానే పెళ్లికి ఒప్పుకునే అవకాశం ఉంది. దీనివల్ల తల్లిదండ్రులపై అసంతృప్తి కలగవచ్చు. వారి భవిష్యత్తు కూడా ప్రభావితం కావచ్చు.
77
పిల్లలను ఎప్పుడూ చిరాకు పెట్టకూడదు. వారితో అది చేయకు, ఇది చేయకు అని ఎప్పుడూ చెబుతూ ఉండకండి. విద్య, ఉద్యోగం, పెళ్లి వంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రతి బిడ్డకు ఉండాలి. ఈ విషయాల్లో తల్లిదండ్రులు వారిని ఎలాంటి ఒత్తిడికి గురిచేయకూడదు. వారు ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటే పిల్లల జీవితంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.