Plastic Lunch Boxes: ప్లాస్టిక్ బాక్స్‌లో ఆహారం తినొద్దని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఎందుకంటే..

Published : Feb 15, 2025, 04:10 PM IST

Plastic Lunch Boxes: ప్లాస్టిక్ వస్తువుల వాడటం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు స్కూల్, కాలేజీ, ఆఫీస్‌లకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ప్లాస్టిక్ బాక్స్‌లలోనే ఫుడ్ తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Plastic Lunch Boxes: ప్లాస్టిక్ బాక్స్‌లో ఆహారం తినొద్దని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఎందుకంటే..

విద్యార్థుల నుంచి ఉద్యోగస్థుల వరకు అందరూ లంచ్ బాక్సులు పట్టకెళతారు కదా.. ఈ లంచ్ బాక్సులు ఎక్కువ శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి. రంగురంగుల ప్లాస్టిక్ బాక్స్‌లలోనే మధ్యాహ్న భోజనం తీసుకెళ్తారు. ముఖ్యంగా పిల్లలకు నచ్చే బొమ్మలతో ఆకర్షించేలా ప్లాస్టిక్ బాక్స్‌లు ఉంటున్నాయి. అది హానికరమని తెలిసినా పిల్లలు మారాం చేస్తే తల్లిదండ్రులు వాటిని కొనిచ్చేస్తారు. అసలు ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ల్లో ఫుడ్ తినడం ఆరోగ్యానికి ఎలా హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం.

25

మసాలా దినుసుల నుండి మధ్యాహ్న భోజనం వరకు ప్రతిదానికీ ప్లాస్టిక్ బాక్స్‌లనే ఉపయోగిస్తుంటారు. కానీ వాటిలో BPA అనే రసాయనం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరమని, గుండె జబ్బులు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు. BPA లేకుండా ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం కుదరని పని. అందుకే వాటిని ఎక్కువగా వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

35

వేడి ఆహారం అస్సలు వద్దు

ఉదయం వండిన వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టినప్పుడు BPA విడుదలై ఆహారంలో కలుస్తుంది. ఆ ఆహారం తిన్నప్పుడు అది శరీరంలో చేరి అనేక వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాకుండా ఆహారం రుచి, రంగును కూడా మారుస్తుంది. ఇది తెలియక టేస్ట్ కొత్తగా ఉందని అందరూ తెగ తినేస్తారు. 

ఇది కూడా చదవండి:  భోజనం తినేటప్పుడు ఒక్కో ముద్దను ఎన్ని సార్లు నమలాలో తెలుసా?

45

ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ లు వాడటం వల్ల నష్టాలు

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. యువతలో యుక్త వయస్సు ఆలస్యంగా వస్తుంది. పురుషుల్లో అయితే వృషణ క్యాన్సర్, శుక్రకణాల సంఖ్య తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.

పిల్లల్లో నడకలో ఇబ్బందులు తలెత్తుతాయి. అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సమస్యలు రావచ్చు. 

 

55

ఇలా చేస్తే మంచిది.. 

ప్లాస్టిక్ బాక్స్‌లకు బదులుగా స్టీల్ టిఫిన్ బాక్స్‌లు వాడండి. ముఖ్యంగా నీటి కోసం స్టీల్ లేదా రాగి బాటిళ్లను వాడండి. అలాగే గాజు బాటిళ్లను కూడా వాడొచ్చు.

ముఖ్య గమనిక: గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ బాక్స్‌లు వాడటం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories