సెలబ్రెటీ క్రష్ ని కలిస్తే.. ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారంటే..?

First Published | Jun 27, 2022, 11:58 AM IST

తమ అభిమాన సెలబ్రెటీలను ఒక్కసారి అయినా కలుసుకోవాలని.. వారితో చూడాలని తహతహలాడుతూ ఉంటారు. అలాంటి అవకాశం నిజంగా వస్తే.. తమ అభిమాన క్రష్ ని కలుసుకున్నప్పుడు ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓ సారి చూద్దాం..

సెలబ్రెటీలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన సెలబ్రెటీలను ఒక్కసారి అయినా కలుసుకోవాలని.. వారితో చూడాలని తహతహలాడుతూ ఉంటారు. అలాంటి అవకాశం నిజంగా వస్తే.. తమ అభిమాన క్రష్ ని కలుసుకున్నప్పుడు ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓ సారి చూద్దాం..
 

1.మేష రాశి..
మేష రాశివారు తమ అభిమాన సెలబ్రెటీ క్రష్ ని కలుసుకునప్పుడు.. చాలా ఎక్సైట్ అవుతారు. వారి ముందు విపరీతంగా  నటించేస్తారు. అయితే.. వారు ఆ నాటకాన్ని ఎక్కువ సేపు చేయలేరు. వీరి నాటకం వెంటనే బయటపడుతుంది.
 


2.వృషభ రాశి..
వృషభ రాశివారు తమ సెలబ్రెటీ క్రష్ ని కలిసినప్పుడు చాలా చార్మింగ్ గా.. స్వీట్ గా  నటిస్తారు. వారిని ఇంప్రెస్ చేయడానికి శతవిథాలా ప్రయత్నిస్తారు. వారితో ఒక్కరోజైనా డేటింగ్ చేయడానికి అవకాశం దొరికితే చాలు అని చూస్తారు.

3.మిథున రాశి..
మిథున రాశివారు.. తమ సెలబ్రెటీ క్రష్ ని కలిసినప్పుడు వారి దగ్గర నుంచి ఆటో గ్రాప్ లేదంటే..ఒక ఫోటో తీసుకోవాలని చూస్తారు. ఆ సమయంలో..  వీరు చాలా టెన్షన్ పడతారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా చేతులు వణికిపోతాయి. వారితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాక టెన్షన్ పడతారు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు తమ  సెలబ్రెటీ క్రష్ ని కలిసినప్పుడు.. చాలా కామ్ గా, కంపోస్డ్ గా ఉంటారు. దాదాపు ఒక ఆటో గ్రాఫ్ అడుగుతారు. ఆ సెలబ్రెటీ ఛాన్స్ ఇష్తే... వారితో కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటారు.
 


5.సింహ రాశి..
 ఈ రాశివారు తమ సెలబ్రెటీ క్రష్ ని కలుసుకున్నప్పుడు.. ఆనందం తట్టుకోలేక ఏడ్చేస్తారు. వారితో.. ఫోటో దిగాలని అనుకుంటారు. అయితే.. ఒకటి కాకుండా.. కనీసం నాలుగు, ఐదు ఫోజులతో ఫోటో దిగాలని అనుకుంటారు.

6.కన్య రాశి..
ఈ రాశివారు తమ సెలబ్రెటీని కలుసుకోవాలని ఆత్రం లోపల ఎంత ఉన్నా... లోపల మాత్రం చాలా  కామ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. కేవలం.. తమ క్రష్ కళ్లలోకి చూసి.. ఒక స్మైల్ మాత్రం ఇస్తారు.
 

7.తుల రాశి..
తుల రాశివారు.. తమ సెలబ్రెటీ క్రష్ ని కలుసుకున్నప్పుడు.. వీరిలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. కేవలం.. తమ ఫ్యామిలీతో కలిసి  సెల్ఫీ తీసుకోవడం లేదంటే.. ఫోటో.. ఆటోగ్రాఫ్ మాత్రమే తీసుకుంటారు.
 

8.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశివారు తమ సెలబ్రెటీ క్రష్ ని కలుసుకునే అవకాశం వస్తే... వారితో ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటారు. అంటే వారిని పొగడటం.. వారు అలా ఉన్నారు.. ఇలా ఉన్నారు అని కాకుండా.. మంచి మీనింగ్ ఫుల్ గా ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి వారు తమ సెలబ్రెటీ క్రష్ ని కలుసుకున్నప్పుడు కచ్చితంగా ఎమోషనల్ అయితే కారు..  కానీ.. తమ ఎక్సైట్మెంట్ ని మాత్రం చూపిస్తారు. వారితో చాలా విషయాలు మాట్లాడతారు.

10.మకర రాశి..
మకర రాశివారు.. తమ సెలబ్రెటీ క్రష్ ని చూసినప్పుడు చాలా హ్యాపీ గా ఫీలౌతారు. కొంచెం ఎక్సైట్ కూడా అవుతారు. అంతేకాని.. వారిని ఇంప్రెస్ చేయడానికి ఈ రాశివారు నటించడం లాంటివి మాత్రం చేయరు.
 

11.కుంభ రాశి..
కుంభ రాశివారు తమ సెలబ్రెటీ క్రష్ ని చూసినప్పుడు వెంటనే వారి దగ్గరకు వెళ్లిపోతారు. తమను తాము పరిచయం చేసుకొని.. తమకు వారంటే ఎంత ఇష్టమో చెప్పేస్తారు. అంతేకాకుండా.. ఆటో గ్రాఫ్ తీసుకుంటారు. వారికి బై చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు.

12.మీన రాశి..
మీన రాశివారు తమ సెలబ్రెటీ క్రష్ ని చూసినప్పుడు వెంటనే సిగ్గు పడిపోతారు. మంచి మూడ్ లో ఉంటే మాత్రం.. కాస్త ధైర్యం చేసి అక్కడకు వెళ్లి వారితో మాట్లాడతారు. ఆ సమయంలో వారి ముఖం వెలిగిపోతుంది.  సంతోషంగా నవ్వుకొని.. వారితో మాట్లాడి.. వెనుదిరుగుతారు.

Latest Videos

click me!