తలస్నానం చేయగానే చేసే ఈ తప్పులే వెంట్రుకలు రాలడానికి కారణం.. అవేంటో తెలుసా?

Published : Jan 26, 2025, 02:30 PM IST

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు ఊడిపోవడం ఒకటి. దీనికి అనేక కారణాలున్నాయి మారిన జీవన విధానం మొదలు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు వరకు దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే మనకు తెలిసి చేసే కొన్ని తప్పులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..   

PREV
14
తలస్నానం చేయగానే చేసే ఈ తప్పులే వెంట్రుకలు రాలడానికి కారణం.. అవేంటో తెలుసా?

చిన్న వయసులో వారు కూడా జుట్టు రాలడంతో బాధపడుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా రాకముందే బట్ట తలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జుట్టు రాలడానికి జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం ఎంత కారణమో జుట్టు సంరక్షణ విషయంలో మనం చేసే పొరపాట్లు కూడా అంతే కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్నానం చేసే విషయంలో కొన్ని తప్పులు చేయకూడదని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

24

తలస్నానానికి బాగా వేడి నీటిని ఉపయోగించకూడదు. దీనివల్ల మాడు డ్రైగా మారే అవకాశం ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు నష్టం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. అదే విధంగా మరీ ఉప్పుగా ఉండే బోరు నీటితోరు, కాలుష్యం ఉండే నీటితో తల స్నానం చేయకూడదు. ఇక తల స్నానం చేసిన వెంటనే జుట్టుకు కండిషనర్‌ ఉపయోగించడం మంచిది. 
 

34

చాలా మంది తల స్నానం చేసిన వెంటనే వెంట్రుకలు ఆరడాఇనకి హెయిర్‌ డ్రయర్స్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. అయితే దీనివల్ల కుదుళ్లలో దురద, అలర్జీ, జుట్టు చితికిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వెంట్రుకలు సహజంగానే ఆరడానికి ప్రయత్నించాలి. అదే విధంగా మైక్రో ఫైబర్‌ ర్యాపర్స్‌తో జుట్టును తుడుచుకుంటే త్వరగా నీరు తొలగిపోతుంది. 
 

44

ఇక మనలో చాలా మంది చేసే మరో తప్పు తలస్నానం చేసిన వెంటనే తల దువ్వుతుంటారు. ఇది కూడా మంచిది కాదు ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి. అందుకే కాసేపు అలాగే వదిలేలాయి. లేదంటే మెత్తటి, దూరం దూరం ఉండే బ్రిజిల్స్‌ ఉండే దువ్వెలను ఉపయోగించడం మంచిది. వెంట్రుకలు పూర్తిగా ఆరకముందే టోపీలు వంటివి ధరించకూడదు. ఇది స్కల్‌ హెల్త్‌ని పాడు చేసే అవకాశం ఉంది. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా కొబ్బరి నూనెను ఉపయోగించడం. వారంలో ఒక్కసారైనా తలకు మంచి నూనె పట్టించి మసాజ్‌ చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి జుట్టు దృఢంగా మారుతుంది. 

నోట్: ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories