Refrigerator: ఫ్రిజ్ ఇలా వాడుతున్నారా? కరెంట్ బిల్లు రెట్టింపు అవుతుంది జాగ్రత్త..!

Published : May 26, 2026, 06:37 PM IST

Refrigerator:  ఈ ఎండాకాలం కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా? దానికి మీ రిఫ్రిజరేటరే కారణం కావచ్చు. మీరు ఫ్రిజ్ విషయంలో  చేసే కొన్ని తప్పుల కారణంగా నే కరరెంటు బిల్లు పెరగొచ్చు.  

PREV
13
Refrigerator

ఫ్రిజ్ వాడే సమయంలో తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. వీటి కారణంగా  తెలీయకుండానే  కరెంటు బిల్లు  పెరిగిపోతుంది. ముఖ్యంగా చాలా మంది.. వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.  దీని వల్ల .. కంప్రెసర్ పై ఒత్తిడి పెరుగుతుంది.  ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. కంప్రెసర్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. కూలింగ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది.

23
ఫ్రిజ్ ఎక్కడ పెడుతున్నారు.

చాలా మంది ఇంట్లో సరిగ్గా స్థలం లేదని… గోడకు దగ్గరగా ఫ్రిజ్ పెడతూ ఉంటారు. ఫ్రిజ్ ని గోడకు దగ్గరగా ఉంచితే.. వెనక కండెన్సర్ కాయలిల్స్ నుండి వేడి బయటకు వెళ్లదు. దీని వల్ల ఫ్రిజ్ వేడేక్కి, కూలింగ్ సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. దీని కారణంగా.. పవర్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. చివరకు కరెంటు బిల్లు బాగా పెరగడానికి కారణం అవుతుంది.

ఫ్రిజ్ లో ఖాళీ లేకుండా వస్తువులు పెట్టడం…

ఎక్కువ మంది.. ఫ్రిజ్ లో ఖాళీ చేయకుండా వస్తువులు పెట్టేస్తూ ఉంటారు.  దీని వల్ల చల్లని గాలి సరిగా ప్రసురించదు. కొన్ని వస్తువులు గడ్డ కడితే.. మరి కొన్ని పాడైపోతాయి. ఇది ఫ్రిజ్ పనితీరు పై ప్రభావం చూపుతుంది.

33
ఫ్రిజ్ శుభ్రం చేయడం లేదా?

చాలా మంది ఫ్రిజ్ లో ఉంచే ఆహారం విషయంలో దృష్టి పెడతారు. కానీ, ఫ్రిజ్ ని శుభ్రం చేయడంపై దృష్టి పెట్టరు. ఫలితంగా..ఫ్రిజ్ లో దుమ్ము , ధూళి పేరుకుపోతుంది.  అంతేకాదు.. దీని వల్ల  కాయిల్స్ పై దుమ్ము పేరుకుపోయి కూలింగ్ తగ్గుతుంది. ఇది మోటార్ పై ఒత్తిడి పెంచి, విద్యుత్ ఖర్చును పెంచుతుంది.

ఫ్రిజ్ టెంపరేచర్ సెట్ చేశారా?

ఫ్రిజ్ లో సరిగా టెంపరేచర్ సెట్ చేయడం చాలా ముఖ్యం. అవసరానికి మించి కూలింగ్ సెట్ చేయడం వల్ల విద్యుత్ వృథా అవుతుంది.  అదే సమయంలో తక్కువ కూలింగ్ వల్ల ఆహారం పాడౌతుంది. అందుకే సరైన టెంపరేచర్ సెట్ చేయడం మంచిది.

ఈ పొరపాట్లు  చేయడం వల్ల మీ ఫ్రిజ్ పనితీరు తగ్గిపోవడమే కాకుండా.. కరెంట్ బిల్లు కూడా పెరిగిపోతుంది. అందుకే, ఈ పొరపాట్లు చేయకపోవడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories