Health Tips: చాయ్ తో పాటుగా బిస్కెట్ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

Published : Apr 11, 2022, 05:00 PM IST

Health Tips: చాయ్ లో బిస్కెట్స్ ముంచుకుని తినే అలవాటుందా.. అయితే వెంటనే మానుకోమని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే ..?  

PREV
17
Health Tips: చాయ్ తో పాటుగా బిస్కెట్ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

Health Tips: చాయ్ తాగేవారికి పక్కాగా ఒక అలవాటు ఉంటుంది. అదే చాయ్ లో బ్రెడ్ లేదా బిస్కెట్స్ లేదా చపాతీలను ముంచుకుని తినడం. చాలా మంది ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు అందులో బిస్కెట్స్ ను పక్కాగా వేసుకుని తాగుతుంటారు. ఇంకొందరైతే టీ ఎప్పుడు తాగితే అప్పుడు బిస్కెట్లను అందులో ముంచుకుని తింటూ ఉంటారు. 
 

27

ఇలా తినడం నోటికి రుచిగా అనిపించినా.. ఈ అలవాటును వెంటనే మానుకోకపోతే మాత్రం ఎన్నో రోగాలను ఏరి కోరి కొని తెచ్చుకున్నవారవుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

37

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం  ప్రకారం.. టీ, బిస్కెట్ కాంబినేషన్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. మరి ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఏమౌతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

47

మనం తినే బిస్కెట్స్ లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ (Hydrogenated fats) ఎక్కువగా ఉంటాయట. ఇక వీటిని ఎక్కువ రోజులు తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

57

అంతేకాదు టీ లేదా కాఫీలో తియ్యని బిస్కెట్లను ముంచుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర లెవెల్స్ పెరుగుతాయి. సోడియం లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెన్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 

67

ఇకపోతే థైరాయిడ్ పేషెంట్లు, మధుమేహులు బిస్కట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బిస్కెట్లను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా  తగ్గిపోతుందని తేల్చి చెబుతున్నారు. బిస్కెట్లలో ఫైబర్ ఏ మాత్రం ఉండదు. కాగా వీటిని తింటే మలబద్దకం సమస్యతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

77

బిస్కెట్స్ మైదా పిండితోనే తయారుచేస్తారు. మైదా మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది షుగర్ లెవెల్స్ ను ఇట్టే పెంచేయగలదు. అంతేకాదు దంతాల కేవిటీని కూడా దెబ్బతీస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories