
పేలవమైన ఆహారపు అలవాట్లు, ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఫుడ్ యే జుట్టు రాలడానికి (Hair loss) ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ గా మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలే జుట్టు ఊడిపోవడాన్ని పెంచుతాయి. జుట్టు ఊడిపోవడానికి దారితీసే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెర (Sugar)
చక్కెర వల్ల నెత్తిమీద ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాగే మాడుపై బ్యాక్టిరీయా పెరుగుతుంది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల చర్మం సమస్యలు తలెత్తుతాయి. అలాగే చుండ్రు (dandruff) సమస్య వస్తుంది. ముఖ్యంగా ఇది జుట్టును బలహీనపరిచి.. చివరకు ఊడిపోయేలా చేస్తుంది.
ప్రాసెస్ ఫుడ్ (Processed food)
ప్రాసెస్ చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల హెల్త్ పాడవడమే కాదు.. హెయిర్ ఫాల్ కు కూడా దారితీస్తుంది. ఈ ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎన్నో హానికరమైన రసాయనాలను మిక్స్ చేస్తారు. ఇది జుట్టును బలహీనపరుస్తుంది. అంతేకాదు వీటిలో ఉండే ఉప్పు (salt), కృత్రిమ రుచులు (Artificial flavors), సంతృప్త కొవ్వు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
ఆల్కహాల్ (Alcohol)
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారు కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మద్యాన్ని ఎక్కువగా తాగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. బలహీనపడుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. అంతేకాదు ఇది ముఖంపై మొటిమలకు కూడా దారితీస్తుంది.
రెడ్ మీట్ (Red meat)
రెడ్ మీట్ ప్రోటీన్ ఫుడ్. దీనిలో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపడేలా చేస్తుంది. అంతేకాదు ఐరన్ కంటెంట్ శరీరంలో ఎక్కువైతే.. క్రమంగా జుట్టు రాలడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ మీట్ క్యాన్సర్ కు దారితీస్తుంది. అందుకే వీలైనంత వరకు దీన్ని తినకుండా జాగ్రత్త వహించండి.
ఫ్రైడ్ ఫుడ్స్ (Fried foods)
ఈ ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్ (Trans fat)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ జుట్టను బలహీనంగా చేస్తాయి. అలాగే గరుకుగా మారుతాయి. ఇది హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. వారానికి ఒకటి రెండు సార్లకంటే ఎక్కువగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్ ను తీసుకుంటే ఆరోగ్యం పాడవడమే కాదు.. జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది.
కూల్ డ్రింక్స్ (Cool drinks)
కూల్ డ్రింక్స్ జుట్టును పాడుచేస్తాయి. వీటిలో అధికంగా ఉండే షుగర్ కంటెంట్ జుట్టుు రాలడానికి కారణమవుతుంది. అంతేకాదు ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడేస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడానికి దారితీస్తాయి.
పాల ఉత్పత్తులు (Dairy products)
పాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువైతే జుట్టు కుదుళ్లు పొడిగా, గరుకుగా తయావుతాయి. అంతేకాదు ఇది జుట్టు రాలిపోవడానికి కూడా కారణమువతుంది. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.