చిన్న పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ఆస్తమా బారిన పడుతుంటారు. ఇది పిల్లలను, పెద్దలను ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది. ఆస్తమా అనేది ఒక అలెర్జీ వ్యాధి. ఇది ఊపిరితిత్తులను.. ముఖ్యంగా వాయుమార్గాలను ప్రభావితం చేసే అలెర్జీ. అలెర్జీ కారకాలే ఆస్తమాకు ప్రధాన కారణం. ఆస్తమాలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక దగ్గు, గురక, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం వంటివి ప్రధాన లక్షణాలు. ఆస్తమా లక్షణాలు చలికాలంలో ఎక్కువయ్యే అవకాశం ఉంది. వాతావరణం, వాయు కాలుష్యం, జీవనశైలి, ఆహారాలు వంటి అనేక కారకాలు ఆస్తమాతో ముడిపడి ఉన్నాయి. ఈ చలికాలంలో ఆస్తమా రోగులు ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి..