ప్రతిరోజు వైన్ తాగితే ఆయుషు పెరుగుతుంది.. మీకు తెలుసా?

First Published Nov 26, 2022, 1:24 PM IST

నిత్యం మద్యం సేవించడం వల్ల అనారోగ్యానికి హానికరం అనే విషయం మనకు తెలిసిందే. అయితే ప్రతిరోజు వైన్ తాగడం వల్ల ఎక్కువ కాలం పాటు ఆయుష్షు ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
 

సాధారణంగా చాలామంది ప్రతిరోజూ పరిమితికి మించిన మోతాదులో ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు. ఇలా ఆల్కహాల్ సేవించడం వల్ల మన శరీరంలోని అవయవాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటారు. అందుకే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలని నిపుణులు ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తెలియజేస్తూ ఉంటారు.

ఇకపోతే వైన్ ద్రాక్షను  పులియబెట్టి తయారు చేస్తారు కనుక వైన్ తాగటం వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తవని అందరూ భావిస్తుంటారు. అయితే వైన్ కూడా సరైన మోతాదులో పరిమితికి మించి తాగటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు కానీ,మోతాదుకు మించి తాగటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ప్రతిరోజు వైన్ పరిమితికి మించి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

*ప్రతిరోజు మనం పరిమితికి మించి వైన్ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తరచూ వైన్ తాగటం వల్ల గుండె జబ్బులను పూర్తిగా దూరం పెట్టవచ్చు. తరచు వైన్ తాగటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.తద్వారా అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.
 

*పలు అధ్యయనాల అనంతరం నిత్యం పరిమిత మోతాదులో వైన్ తాగే వారిలో ఆయుష్షు కూడా ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
 

*హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన పలు అధ్యయనాలలో భాగంగా తరచూ వైన్ తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.ఇలా వైన్ తాగటం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు దరికి చేరవని నిపుణులు వెల్లడించారు.

*ఇక ప్రతి రోజు వైన్ తాగడం వల్ల 30% డయాబెటిస్ వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా ప్రతిరోజు వైన్ తాగటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పలు అధ్యయనాల ద్వారా వెళ్లడైంది.

click me!