World Tourism Day : ప్రయాణాల్లో ఎప్పుడైనా.. ఈ టూరిస్ట్ ఫ్రెండ్లీ, వరల్డ్ ఫేమస్ కాఫీలు రుచి చూశారా?

First Published | Sep 27, 2021, 1:28 PM IST

ఇంట్లో రెగ్యులర్ గా కాఫీ తాగేవారు.. ఆ రుచికి ఎంతగా అడిక్ట్ అవుతారంటే.. కాఫీ పొడి, చక్కెర, పాల మోతాదుల్లో ఏ కాస్త తేడా వచ్చినా ఒప్పుకోలేరు. ఈ తేడాతో వారి రోజు అసంపూర్ణంగా ఉన్నట్టుగా ఫీలవుతారు. అందుకే ప్రయాణాల్లో దొరికే కాఫీని పెద్దగా ఆస్వాదించలేకపోతారు. అందుకే తమతో పాటు కాఫీ సామాగ్రిని క్యారీ చేస్తుంటారు. అలాంటి వారు వివిధ రకాల కాఫీలు, వాటి తయారీ, సామాగ్రి గురించిన విషయాలు తెలుసుకుంటే.. ప్రయాణాల్లోనూ కాఫీని ఎంచక్కా ఎంజాయ్ చేయచ్చు. 

మీరు కాఫీ ప్రేమికులా? కాఫీ వాసన ముక్కుపుటలకు సోకగానే ప్రాణం లేచి వస్తుందా? కానీ ప్రయాణాల్లో ఇంట్లోలాంటి కాఫీని మిస్సవుతున్నారా? అలా జరగకుండా ఉండాలంటే.. మీ ప్రయాణాలు మీ కాఫీ ఇష్టం అంత ఆహ్లాదంగా సాగాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. 

ఇంట్లో రెగ్యులర్ గా కాఫీ తాగేవారు.. ఆ రుచికి ఎంతగా అడిక్ట్ అవుతారంటే.. కాఫీ పొడి, చక్కెర, పాల మోతాదుల్లో ఏ కాస్త తేడా వచ్చినా ఒప్పుకోలేరు. ఈ తేడాతో వారి రోజు అసంపూర్ణంగా ఉన్నట్టుగా ఫీలవుతారు. అందుకే ప్రయాణాల్లో దొరికే కాఫీని పెద్దగా ఆస్వాదించలేకపోతారు. అందుకే తమతో పాటు కాఫీ సామాగ్రిని క్యారీ చేస్తుంటారు. అలాంటి వారు వివిధ రకాల కాఫీలు, వాటి తయారీ, సామాగ్రి గురించిన విషయాలు తెలుసుకుంటే.. ప్రయాణాల్లోనూ కాఫీని ఎంచక్కా ఎంజాయ్ చేయచ్చు. 


ఎస్ప్రెస్సో :  40-45 మిల్లీలీటర్ల వేడి నీటిని ఫోర్సింగ్ గా టైట్ ప్యాక్ చేసిన, చక్కగా గ్రౌండ్ చేసిన ఎస్ప్రెస్సో కాఫీతో కలపడం ద్వారా ఎస్ప్రెస్సో షాట్ రెడీ అవుతుంది. దీనివల్ల కాఫీ ముదురు గోధుమ రంగులో, కొద్దిగా మందపాటి ద్రవంలా కనిపిస్తుంది.  పైన చిన్న మొత్తంలో క్రీమ్ ఉంటుంది. అయితే ఎస్ప్రెస్సోను తయారు చేయడానికి, ఎస్ప్రెస్సో మెషీన్ అవసరం. అయితే ఎస్ప్రెస్సో మెషీన్ చాలా ఖరీదైంది. ప్రయాణించేటప్పుడు తీసుకెళ్లడం అంత సులభం కాదు, కాబట్టి ప్రత్యామ్నాయంగా మీరు మోకా పాట్‌ను ప్రయత్నించవచ్చు. మోకా పాట్ 1933 లో అల్ఫోన్సో బియాలెట్టి పేటెంట్ పొందారు. ఇది ఆవిరి పీడనంతో కాఫీని చేసే స్టవ్‌టాప్ కాఫీ మేకర్. దీన్ని వాడడం తేలిక, క్యారీ చేయడం తేలిక. 

Vietnamese Drip Coffee

వియత్నామీస్ డ్రిప్ కాఫీ : చాలామంది సోషల్ మీడియాలో వియత్నామీస్ కాఫీ గురించి వినే ఉంటారు. వియత్నామీస్ కాఫీ అనేది ఒక స్ట్రాంగ్ అండ్ స్వీట్ కాఫీ. ఇది డార్క్ రోస్ట్ కాఫీ, మెటల్ ఫిల్టర్ ద్వారా నెమ్మదిగా చుక్కలుగా పడిన కాఫీని,  కండెన్సెడ్ మిల్క్ తో కలిపి తాగుతారు. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో కాఫీ పొడి వేసిన కాఫీ ఫిల్టర్ ని కండెన్సెడ్ మిల్క్ గ్లాసు మీద పెట్టి.. అందులో వేడినీరు పోయాలి. 4 - 5 నిమిషాల తరువాత, కాఫీ మొత్తం వేడిగా గ్లాసులోకి దిగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. దీన్ని ఎక్కడికైనా మీ బ్యాగులో పెట్టుకుని చక్కగా పట్టుకెళ్లిపోవచ్చు. 

Turkish Coffee

టర్కిష్ కాఫీ : టర్కిష్ కాఫీ కేవలం పానీయం కాదు, అది ఒక అనుభవం. టర్కిష్ కాఫీని ఇబ్రిక్ అనే ప్రత్యేక కుండలో తయారు చేస్తారు. దీన్ని  సాధారణంగా రాగి లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఈ  పద్ధతిలో,  ఇబ్రిక్‌లో చల్లటి నీటిలో కలిపిన కాఫీ పొడి కలపాల్సి ఉంటుంది. ప్రతి కప్పు కాఫీ కోసం, ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీని వాడాలి. కాఫీలో చక్కెర కావాలనుకుంటే ముందే కలపాలి. ఆ తరువాత అది కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మీడియం వేడి మీద మరగనివ్వాలి. దీనికి 3-4 నిమిషాలు పడుతుంది. కాఫీ వేడెక్కినప్పుడు, ఒక నల్లటి నురుగు ఏర్పడుతుంది. కాఫీ మరుగుతున్నప్పుడు, సగం కాఫీని కప్పుల్లోకి, నురుగు మీద పోయాలి. స్టవ్‌టాప్‌మీద కాఫీ పాట్‌ను పెట్టేసి.. మిగిలిన కాఫీని ఇంకో  10-15 సెకన్ల పాటు మరగనిచ్చి కప్పులను పూర్తిగా నింపండి. 

డాల్గోనా కాఫీ : ఈ కాఫీ కరోనా మహమ్మారి సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఇది మన ఇళ్లలో యేళ్లుగా వాడుతున్న అత్యంత సాంప్రదాయక కాఫీ తయారీ సాంకేతికతనే వాడడం వల్ల కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ డాల్గోనా కాఫీని తయారు చేయడానికి కాఫీ గ్రౌండ్, చక్కెరను ఒక కప్పులో తీసుకుని కొన్ని వేడి పాలు కలిపి బీట్ చేయాలి. కాఫీ క్రీముగా చిక్కగా, మారుతుంది. ఇప్పుడు, దీన్ని ఐస్ క్యూబ్స్‌తో నిండిన పాలగ్లాస్‌ లో పోయండి. తరువాత దీనిమీద కాఫీ పొడితో అలంకరించండి. అంతే డాల్గోనా కాఫీ రెడీ. 

ఐరిష్ విస్కీ కాఫీ : ఈ కాఫీని ఐర్లాండ్‌లోని లిమెరిక్ దగ్గర్లోని ఫోయిన్స్ పోర్ట్‌లోని చెఫ్ 1943  వింటర్ సీజన్ లో కనిపెట్టాడు. అతని పేరు జో షెరిడాన్.  అయితే, ఈ ఐరిష్ విస్కీ కాఫీ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రాచుర్యం పొందింది. దీన్ని అతి మామూలుగా తయారు చేస్తారు. దీనికోసం కొంచెం వేడి కాఫీ, చక్కెర (బ్రౌన్/ డెమెరారా షుగర్), ఐరిష్ విస్కీ, కొంత విప్డ్ క్రీమ్ అవసరం. ఇందులోని అన్ని ఐటమ్స్ లో  కాఫీ కీలకంగా పనిచేస్తుంది. 

సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీల గురించి మాట్లాడుకునేటప్పుడు.. సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ గురించి చెప్పుకోకుండా ఉండలేం. ఈ కాఫీని తయారుచేసే టెక్నిక్ చాలా ఈజీ. దీంతోపాటు  తయారీ సామగ్రి పోర్టబుల్ గా ఉంటుంది. దీనిని 17 వ శతాబ్దంలోనే చిక్‌మంగళూరుకు చెందిన ముస్లిం సన్యాసి బాబా బుడాన్ తీసుకువచ్చారు. సాంప్రదాయకంగా, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఇత్తడి టంబ్లర్, దబారాలో వడ్డిస్తారు, కానీ ప్రస్తుతం అది ఫిల్టర్ కాఫీ ని ఎలా తయారు చేస్తున్నారన్న దానికంటే దానికి వాడుతున్న కట్లరీ గురించి పట్టించుకునేదానికంటే ఎక్కువ ఫిల్టర్ చేసుకని తాగుతున్నాం అనేదానిమీద వ్యామోహమే ఎక్కువయ్యింది. 

coffee Filter

ఈ కాఫీని చేయడానికి ప్రత్యేకమైన దక్షిణ భారతీయ ఫిల్టర్ అవసరం, దీంట్లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక చిన్న ప్లంగర్‌ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా, పై చాంబర్‌కి కాఫీ పొడిని కలపాలి. తరువాత దీన్ని ప్లంగర్‌తో కప్పి.. దీనిమీద వేడినీరు పోయాలి. ఆ తరువాత కాఫీ ఫిల్టర్‌ మూత పెట్టి 7 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఈ డికాక్షన్ పడేలోపు స్టవ్‌పై పాలు మరిగించాలి. ఆ తరువాత మరిగిన పాలలో ఒక కప్పుకు 1 నుండి 2 టేబుల్ స్పూన్ల డికాక్షన్ కలపాలి. చక్కెర కలుపుకుని కాఫీని ఆస్వాదించండి.  ఈ సౌత్ ఇండియన్ ఫిల్టర్ ఒక చిన్న స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా ఇత్తడి పాత్ర, ఇది ప్రయాణించేటప్పుడు సులభంగా తీసుకువెళ్లొచ్చు. 

Latest Videos

click me!