Parthenogenesis: ఈ భూమ్మీద.. మగతోడు లేకుండా పిల్లల్ని కనే జీవులున్నాయా.. సైన్స్ ప్రకారం అది సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటున్నారు నిపుణులు. మరి ఆ వింత జీవులు ఏంటో తెలుసా?
మనిషైనా, జంతువైనా మగతోడు లేకుండా పిల్లలు పుట్టడం జరగదు. ప్రకృతిలో ప్రతి జీవి సంతానోత్పత్తి కోసం ఆడ, మగ జీవుల కలయిక అవసరం. మనుషుల నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు ఇదే సాధారణ ప్రక్రియ. కానీ ప్రకృతి ప్రపంచంలో కొన్ని జీవులు మాత్రం ఈ నియమానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అసలు తోడు లేకుండా పిల్లల్ని కనే ఆ జీవులేంటో తెలుసా?
25
తేనెటీగలు (Honey bees)
తేనెటీగలు అయితే ఆడ-మగ కలయిక లేకుండానే పుడతాయి. తేనెపట్టులో ఉండే రాణి ఈగ, మగ ఈగతో జత కట్టకుండానే గుడ్లు పెడుతుంది. ఫలదీకరణ చెందని ఈ గుడ్ల నుంచే వేల సంఖ్యలో మగ తేనెటీగలు పుడతాయి.
35
చీమలు, కందిరీగలు
ఇవి కూడా పార్థినోజెనిసిస్ పద్ధతిలోనే తమ సంతానాన్ని పెంచుకుంటాయి. అంటే, ఆడ-మగ చీమల మధ్య కలయిక జరగకపోయినా కొత్త చీమలు పుడుతూనే ఉంటాయి. కందిరీగల్లోనూ లైంగిక సంపర్కం ఉండదు. అయినా కూడా, సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగి, కొత్త కందిరీగలు పుడతాయి.
ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతాల్లో కనిపించే భారీ బల్లులే ఈ కొమోడో డ్రాగన్లు. ఇవి కూడా పార్థినోజెనిసిస్ ద్వారా, అంటే మగ జీవి లేకపోయినా ఆడ జీవులు పిల్లల్ని కనగలవు. రెటిక్యులేటెడ్ పైథాన్ లాంటి కొన్ని రకాల కొండచిలువలు కూడా మగ పాముతోడు లేకుండానే పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పాములు జత లేకుండానే గుడ్లు పెట్టి, వాటిని పొదిగి పిల్లల్ని చేస్తాయి.
55
షార్కులు (Sharks)
సముద్ర జీవుల్లోనూ ఈ పార్థినోజెనిసిస్ కనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్‌టిప్, జీబ్రా షార్క్ వంటి కొన్ని షార్క్ జాతులలో, మగ షార్క్‌తో సంబంధం లేకుండానే ఆడ షార్క్ పిల్లలకు జన్మనిస్తుంది.