వానాకాలంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలాంటివి వేసుకోకూడదు..?

Published : Jul 08, 2022, 12:00 PM ISTUpdated : Jul 08, 2022, 12:02 PM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆఫీసులకు వెళ్లే వారు, పనులపై బయటకు వెళ్లే వారు తడిచే అవకాశం ఉంది. వర్షంలో తడిస్తే చర్మంపై బ్యాక్టీరియా, వైరస్ లు పేరుకునే ప్రమాదం ఉంది. దీనికి తోడు చర్మం ఎక్కువ సేపు తడిగా ఉండే ఎన్నో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

PREV
110
వానాకాలంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలాంటివి వేసుకోకూడదు..?

చిటపట చినుకులు పడుతూ ఉంటే.. ఇంట్లో ఓ కిటికీ పక్కన కూర్చుని వేడి వేడి బజ్జీలు లేదా టీ తాగుతుంటే వచ్చే ఆ ఆనందమే వేరబ్బా.. ఇలాంటి మూమెంట్ ను ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. అందుకే రెయినీ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే వర్షాల రాక మంచిదే అయినప్పటికీ.. ఈ సీజన్ లో ఎన్నో అంటువ్యాధులు, రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మిగతా సీజన్ల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

210

అయితే ఈ సీజన్ లో ఆఫీసులకు వెళ్లే వారు, ఇతర పనులపై బయటకు వెళ్లేవారు, వానలో తడిచే వారు బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బట్టలు ఎక్కువ సేపు తడిగా ఉంటే ఎన్నో చర్మ సమస్యలు ఇతర రోగాల బారిన పడే అవకాశం ఉంది. మరి ఈ సీజన్ లో ఎలాంటి బట్టలను వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

310

వర్షాకాలంలో మినీ షార్ట్స్, సన్ డ్రెసెస్ జోలికి వెల్లకపోవడమే మంచిది. ఎండలు లేనప్పటికీ, తేమ, వేడి కారణంగా కూడా శరీరంలో విపరీతంగా చెమట పడుతుంది. ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు పొడిగా, చల్లగా ఉంచుకోవాల్సి అవసరం ఎంతో ఉంది.

410

కాటన్ దుస్తులు

ఈ సీజన్ లో కాటన్ దుస్తులు బెస్ట్ ఎంపికనే చెప్పాలి. ఈ బట్టలు వానకు తడిసినా చాలా తర్వగా ఎండిపోతాయి. కంఫర్ట్ గా కూడా ఉంటాయి. కాటన్ టీ షర్టులను కూడా ధరించొచ్చు. వాటిని డెనిమ్ షార్ట్స్ తో వేసుకోవచ్చు. కాటన్ కుర్తాలు, లెగ్గింగ్స్ కంఫర్టబుల్ గా ఉంటాయి. అయితే ఇవి పూర్తిగా శరీరానికి అత్తుక్కుపోయేలా ఉండకుండా చూసుకోండి. అలా వేసుకుంటే చెమట పడుతుంది. దీంతో మీరు ఇబ్బంది పడొచ్చు. 
 

510

డెనిమ్

వర్షాకాలంలో డెనిమ్ దుస్తులు కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇవి చాలా స్టైలీష్ లుక్ లో కూడా కనిపిస్తాయి. ఈ డెనిమ్ దుస్తుల్లో మినీ దుస్తులను కూడా ధరించొచ్చు. అయితే ఈ దుస్తులను తరచుగా వాస్ చేయకూడదు. ఎందుకంటే ఈ సీజన్ లో ఎండ తక్కువగా ఉండటం వల్ల అవి తొందరగా ఆరవు. దీంతో బట్టలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. 

610

ఖాదీ

ఈ సీజన్ లో వేసుకోదగిన బట్టల్లో ఖాదీ ఒకటి. ఈ బట్టలు తేలిగ్గా ఉంటాయి. వానలో తడిసినా చాలా తొందరగా ఎండిపోతాయి. అయితే ఈ ఖాదీ బట్టలను ఎప్పుడూ చల్ల నీటితోనే వాష్ చేయాలి. 
 

710

నేయాన్

కాటన్ దుస్తులు మీకు నచ్చనట్టైతే.. రేయాన్  దుస్తులను ధరించొచ్చు. ఇవి తేలిగ్గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది. రేయాన్ డ్రెస్, డెనిమ్ జాకెట్ తో లుక్ అదిరిపోతుంది.

810

అయితే ఈ సీజన్ లో వైట్ కలర్ డ్రెస్సులను వేసుకోకపోవడమే ఉత్తమం. వీటిపై మరకలు పడితే అంత తొందరగా పోవు. అందుకే ఈ రెయినీ సీజన్ లో తెల్ల దుస్తులను వేసుకోకూడదు. అలాగే ఒంటికి అత్తుక్కుపోయే దుస్తుులను, పట్టు వస్త్రాలను, తోలు, షిఫాన్లు, జార్జెట్, వెల్వెట్లను వేసుకోకూడదు. ఎందుకంటే ఇవి అంత తొందరగా ఆరవు.

910

యాక్ససరీల చిట్కాలు: 

ఈ సీజన్ లో మీరు ధరించే ఆభరణాలు, గ్యాగులు, చేతి వాచ్ లు వాటర్ ప్రూఫ్ గా ఉండేట్టు చూసుకోండి. ఒక వేళ అవి తడిసినా పాడవవు. పూసల బ్రాస్ లెట్ లు, స్టేల్ మెంట్ నెక్ పీస్ లు, పెద్దని చెవి ఆభరణాలను ధరించండి. ముఖ్యంగా ఈ సీజన్ లో  లోహపు ఆభరణాలను ధరించకపోవడే మంచిది. ఎందుకంటే తేమ కారణంగా ఇవి మెరుపును కోల్పోతాయి. 
 

1010

ఎలాంటి పాదరక్షలు వేసుకోవాలి: 

ఈ సీజన్ లో సులభంగా ఆరే, తేలికగా ఉండే పాదరక్షలను మాత్రమే ధరించాలి. ఇందుకోసం ఫ్రెండ్లీ ఫ్లిప్ ఫ్లాప్ లను ధరించండి. ఇవి చాలా సన్నగా ఉండి.. తడిసినా చాలా తొందరగా ఎండిపోతాయి. లెదర్ షూస్, స్పోర్ట్స్ షూస్, స్నీకర్లు వంటి వాటిని ధరించకూడదు. ఎందుకంటే ఇవి అంత తొందరగా ఆరవు. దీంతో మీ పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories