Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే

Published : Jun 25, 2026, 03:09 PM IST

 Chanakya Niti: ఈ మధ్యకాలంలో పెళ్లి పేరిట అమ్మాయిలు అబ్బాయిలను దారుణంగా మోసం చేస్తున్నారు.హనీమూన్ కి తీసుకువెళ్లి చంపేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో పడకూడదంటే చాణక్యుడి నియమాలు ఫాలో అవ్వాల్సిందే. 

PREV
14
ఎలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాలి?

జీవిత భాగస్వామిని సెలక్ట్ చేసుకునే విషయంలో చిన్న తప్పు చేసినా జీవితమే నాశనం అవుతుంది. అందుకే, ఈ విషయంలో చాణక్యుడు చెప్పిన నియమాలను ఫాలో అవ్వాలి. వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితాన్ని సంతోషంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లికి ముందే.. మనం ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటున్నాం అనే విషయంపై దృష్టి పెట్టాలి. అదెలాగో.. చాణక్యనీతి ఏం చెబుతుందో తెలుసుకుందాం...

24
స్వభావాన్ని తెలుసుకోవాలి..

చాణక్యుడి ప్రకారం.. ఒక వ్యక్తి నిజమైన స్వరూపం వారి స్వభావం ద్వారా బయటపడుతుంది. కేవలం వారి బాహ్య సౌందర్యం చూసి, వారి అందానికి ఆకర్షితులై లైఫ్ పార్ట్నర్ ని ఎప్పుడూ సెలక్ట్ చేసుకోకూడదు. వారి వ్యక్తిత్వం ఎలాంటిదో పూర్తి తెలుసుకోవాలి. అబద్ధాలు చెప్పేవారు, కోపిష్టి, స్వార్థపరులను ఎంచుకుంటే.. మీకు ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు. అలాంటివారిని జీవితంలోకి ఆహ్వానించకపోవడమే మంచిది.

34
కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవడం కూడా ముఖ్యం..

కేవలం మనిషి నచ్చితే సరిపోదు.. వారి కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కుటుంబం ఆధారంగానే మనిషి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే.. పెళ్లికి ముందే మీ కాబోయే జీవిత భాగస్వామి కుటుంబ వాతావరణాన్ని, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మంచి విలువలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే.. మీ జీవితం సంతోషంగా ఉంటుంది. లేకపోతే మీరు సమస్యల్లో పడిపోతారు.

44
శీలం..

చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తికి శీలం చాలా గొప్ప ఆస్తి. ఒక వ్యక్తి శీలం సందేహాస్పదంగా, నమ్మసక్యంగా లేకపోతే..వారి కారణంగా మీకు భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఈ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.

నమ్మకం, గౌరవం..

మీ కాబోయే జీవిత భాగస్వామి మిమ్మల్ని నమ్మడం లేదా గౌరవించడం లేదని మీకు అనిపిస్తే, జాగ్రత్తగా ఉండండి. పరస్పర గౌరవం, నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం నిలవదు. అందువల్ల, పెళ్లికి ముందే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories