Bed sheets: వర్షాకాలంలో ఎలాంటి బెడ్ షీట్లు వాడాలి? ఈ వెదర్ కు ఏవైతే బెటర్?

Published : Jun 25, 2026, 01:44 PM IST

Bed sheets: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవు. బెడ్ షీట్లు, దుప్పట్లైతే సరేసరి. సరిగ్గా ఆరక దుర్వాసన వస్తుంది. అది ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే మందపాటి బెడ్ షీట్లు కంటే ఈ కాటన్ బ్లెండ్ బెడ్‌షీట్లు బెటర్. మీ గదికి ఫ్రెష్, వైబ్రెంట్ లుక్ ఇస్తాయి.

PREV
15
వర్షాకాలంలో బెడ్‌షీట్ ఎలా ఉండాలి?

వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరక వాసన వస్తుంటాయి. అందులోనూ బెడ్ షీట్లు, దుప్పట్ల గురించి చెప్పక్కర్లేదు. ఉతికి వారమైనా ఆరవు. అవి మందంగా ఉండటంలో తేమ ఉండిపోతుంది. దాంతో ముక్కి వాసన వస్తుంది. అందుకే వర్షాకాలంలో బెడ్‍షీట్ ఎంచుకునేటప్పుడు దాని ఫ్యాబ్రిక్‌పై చాలా శ్రద్ధ పెట్టాలి. తేమ, చెమ్మ సమస్య రాకుండా ఉండాలంటే తేలికగా ఉండాలి, త్వరగా ఆరిపోయే బట్టలను ఎంచుకోవాలి. కాటన్ బ్లెండ్ బెడ్‌షీట్లు వర్షాకాలానికి బెస్ట్ ఆప్షన్. ఇవి సౌకర్యంగా ఉండటమే కాకుండా, త్వరగా ఆరిపోతాయి. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వెల్వెట్ లేదా మందపాటి ఫ్యాబ్రిక్ బెడ్‌షీట్లకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి తేమను ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి.

25
పీకాక్ ప్రింట్ బెడ్‌షీట్

మీరు మీ గదికి రాయల్, ఎలిగెంట్ లుక్ ఇవ్వాలనుకుంటే, పీకాక్ ప్రింట్ బెడ్‌షీట్ ఒక అద్భుతమైన ఎంపిక. తెలుపు రంగు బేస్‌పై నీలిరంగు బోర్డర్, మధ్యలో అందమైన నెమలి డిజైన్ గదిని ఆకర్షణీయంగా మారుస్తుంది. దీనికి మ్యాచింగ్ పిల్లో కవర్లు కూడా వస్తాయి. 100% కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ బెడ్‌షీట్‌ను సులభంగా ఉతకవచ్చు, వర్షాకాలంలో త్వరగా ఆరిపోతుంది.

35
లీఫ్ ప్రింట్ బెడ్‌షీట్

గ్రీనరీ ఇష్టపడేవారికి లీఫ్ ప్రింట్ బెడ్‌షీట్ సరైనది. తెల్లటి బేస్‌పై ఆకుపచ్చ రంగులో ఉన్న రకరకాల ఆకుల డిజైన్ గదికి ఫ్రెష్, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ వర్షాకాలపు పచ్చదనాన్ని ఇంటి లోపలికి తీసుకొచ్చినట్టు ఉంటుంది.

45
బటర్‌ఫ్లై ప్రింట్ బెడ్‌షీట్

రంగురంగుల సీతాకోకచిలుకల ప్రింట్‌తో ఉన్న బెడ్‌షీట్ వర్షాకాలంలో చాలా అందంగా కనిపిస్తుంది. తెల్లటి బేస్‌పై మల్టీకలర్ బటర్‌ఫ్లై ప్రింట్లు గదికి ఫ్రెష్, సంతోషకరమైన వాతావరణాన్ని ఇస్తాయి. ఈ బెడ్‌షీట్ పిల్లల గదులతో పాటు మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా అద్భుతంగా కనిపిస్తుంది.

55
బాతిక్ ప్రింట్ బెడ్‌షీట్

కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్‌తో చేసిన బాతిక్ ప్రింట్ బెడ్‌షీట్ రోజువారీ వాడకానికి ఉత్తమమైనది. దీని బట్ట మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. నీలం, పసుపు, ఎరుపు వంటి వైబ్రెంట్ రంగులలో లభించే ఈ ప్రింట్లు గదికి క్లాసిక్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. మార్కెట్లో ఇలాంటి బెడ్‌షీట్లు మీకు సుమారు ₹500 నుంచి ₹600 ధరలో సులభంగా దొరుకుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories