Home Decor: ఈ ఇంటీరియర్ డిజైన్ టెక్నిక్ తో మీ ఇంటిని స్టైలిష్ గా మార్చేయొచ్చు

Published : Jun 25, 2026, 02:35 PM IST

Home Decor: నగరాలు, పట్టణాలు విస్తరిస్తూ పోతున్నాయి. ఈ పట్టణాల్లో పెద్ద ఫ్లాట్లు దొరకడం కష్టం. దొరికినా చిన్న ప్లేస్ లోనే కుదించాల్సి వస్తుంది. అయితే ఈ ఇంటీరియర్ డిజైనర్ల టెక్నిక్‍తో  లివింగ్ రూమ్‌ని కూడా స్టైలిష్‌గా మార్చేయొచ్చు.

PREV
16
లగ్జరీ ఫీల్ ఇచ్చే 5 టిప్స్

నగరాలు, పట్టణాలు విస్తరిస్తూ పోతున్నాయి. చెరువులు, కుంటలు, పొలాలు, కబ్జా చేస్తున్నారు. వాటి చోటే పెద్ద పెద్ద భవనాలు, విల్లాలు నిర్మించేస్తున్నారు. అంతేకాదు..ప్రస్తుతం ఈ పట్టణాల్లో పెద్ద ఫ్లాట్లు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా, వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సరేలే ఏదో స్థలం దొరికింది కదా అని చిన్న చిన్న ప్లేస్ లోనే ఇళ్లు కట్టుకుంటున్నారు. ఒకవేళ మీరు కొత్తగా ఫ్లాట్ కొని, అందులో లివింగ్ రూమ్ చిన్నగా ఉందని ఫీల్ అవుతున్నారా? కంగారు పడకండి. కొన్ని సింపుల్ టిప్స్‌తో చిన్న జాగాను కూడా స్టైలిష్‌గా, విశాలంగా మార్చేయొచ్చు. తక్కువ స్థలంలోనూ లగ్జరీ ఫీల్ ఇచ్చే 5 సులభమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.

26
ఫోల్డింగ్ టేబుల్స్, నెస్టింగ్ టేబుల్స్
ఈ రోజుల్లో మోడ్రన్ డెకర్‌లో స్టోరేజ్ ఉండే సోఫాలు, మడతపెట్టే టేబుల్స్ (ఫోల్డింగ్ టేబుల్స్), ఒకదానిలో ఒకటి ఇమిడిపోయే టేబుల్స్ (నెస్టింగ్ టేబుల్స్) బాగా పాపులర్ అయ్యాయి. ఇలాంటి ఫర్నిచర్ తక్కువ జాగా తీసుకుంటుంది. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. దీనివల్ల గది నీట్‌గా, ఎలాంటి అడ్డంకులు లేకుండా కనిపిస్తుంది.
36
ఇంటీరియర్ డిజైనర్ల టెక్నిక్స్‌

మీ లివింగ్ రూమ్ మరింత పెద్దదిగా కనిపించాలంటే, గోడకు ఒక పెద్ద అద్దాన్ని తగిలించండి. అద్దం సహజమైన, కృత్రిమ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల గదిలో ఎక్కువ ప్లేస్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటీరియర్ డిజైనర్లు ఎక్కువగా వాడే టెక్నిక్స్‌లో ఇది కూడా ఒకటి.

46
గదికి మోడ్రన్ లుక్
చిన్న గదిలో నేల మీద జాగాను ఆదా చేయడానికి గోడలను వాడుకోండి. గోడకు అమర్చే షెల్ఫ్‌లు (ఫ్లోటింగ్ షెల్ఫ్), వాల్-మౌంటెడ్ టీవీ యూనిట్, వేలాడే మొక్కలు (హ్యాంగింగ్ ప్లాంట్స్) గదికి మోడ్రన్ లుక్ ఇస్తాయి. దీనివల్ల నేల ఖాళీగా కనిపించి, గది విశాలంగా అనిపిస్తుంది.
56
గోడలకు, కర్టెన్లకు లైట్ కలర్స్ బెటర్

చిన్న లివింగ్ రూమ్‌లకు తెలుపు, క్రీమ్, లేత బూడిద రంగు (లైట్ గ్రే) లేదా పేస్టల్ షేడ్స్ చాలా బాగుంటాయి. ఈ రంగులు గదిలోకి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేసి, గదిని విశాలంగా చూపిస్తాయి. గోడలకు, కర్టెన్లకు లేత రంగులు ఎంచుకుంటే మీ గది పెద్దదిగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. 

66
ఆర్ట్‌వర్క్ తో ప్రీమియం లుక్

చిన్న లివింగ్ రూమ్‌లో ఎక్కువ అలంకరణ వస్తువులు పెడితే, గది నిండిపోయినట్లు అనిపిస్తుంది. దానికి బదులుగా, కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మాత్రమే ఎంచుకోండి. ఉదాహరణకు, సింపుల్ ఆర్ట్‌వర్క్, మంచి డిజైన్ ఉన్న కుషన్లు, ఇండోర్ ప్లాంట్స్, సాఫ్ట్ లైటింగ్ వాడండి. ఈ పద్ధతి మీ గదికి చాలా ఎలిగెంట్, ప్రీమియం లుక్ ఇస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories